Advertisement

Advertisement


Home > Movies - Movie News

కోబ్రా.. విక్ర‌మ్ సినిమాకు ఇంత దారుణ క‌లెక్ష‌న్లా!

కోబ్రా.. విక్ర‌మ్ సినిమాకు ఇంత దారుణ క‌లెక్ష‌న్లా!

ద‌శాబ్దంన్న‌ర కాలంగా చెప్పుకోద‌గిన హిట్ లేకపోయినా.. త‌న న‌ట‌నా ప‌టిమ‌తో ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతూ, ప్ర‌తిసారీ త‌న సినిమా ట్రైల‌ర్ వ‌ర‌కూ అయినా ఆస‌క్తిని కొన‌సాగిస్తున్న చియాన్ విక్ర‌మ్ కు కోబ్రాతో చాలా దారుణ‌మైన అనుభ‌వ‌మే మిగిలేట్టుగా ఉంది. 

త‌మిళ‌నాడులోనే క‌నీస ఓపెనింగ్స్ ను కూడా పొంద‌లేక‌పోయింది ఈ సినిమా! లెంగ్తీ ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకోవాల‌ని చూసినా.. విక్ర‌మ్ సినిమాను త‌మిళులు కూడా సీరియ‌స్ గా తీసుకోలేదు! తొలి రోజు ఈ సినిమాకు 9 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ వ‌సూళ్లు ద‌క్కాయ‌ట‌. అయితే రెండో రోజు నుంచినే ప‌రిస్థితి మారిపోయింది. 

రెండో రోజు వ‌సూళ్లు రెండున్న‌ర కోట్లు, మూడో రోజుకు రెండు కోట్ల రూపాయ‌ల లోపుకు వ‌సూళ్లు ప‌డిపోయాయి. ఇక వారాంతం ప్ర‌భావం కూడా ఈ సినిమాపై ఏ మాత్రం క‌నిపించ‌డం లేదు. తిప్పి తిప్పి కొడితే కోబ్రా గ్రాస్ వ‌సూళ్లు క‌నీసం 15 కోట్ల రూపాయ‌ల‌ను కూడా దాటేయ‌లేదు ఇప్ప‌టి వ‌ర‌కూ! ఇక అద్భుతం జ‌రిగితే త‌ప్ప విక్ర‌మ్ సినిమా క‌నీసం బ్రేక్ ఈవెన్ లోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ట్రేడ్ టాక్. 

బ్రేక్ ఈవెన్ ఆశ‌లు కూడా పెట్టుకోన‌క్క‌ర్లేద‌ని నాలుగైదు రోజుల క‌లెక్ష‌న్లు క్లారిటీ ఇస్తున్నాయి! స్టైలిష్ మేకింగ్ అంటూ విక్ర‌మ్ సినిమాల బ‌డ్జెట్ లు వంద కోట్ల రేంజ్ లోనే ఉంటాయి. తీరా బాక్సాఫీస్ వ‌ద్ద ప‌దో వంతు షేర్ కూడా ద‌క్కక‌పోవ‌డం కొత్త కాకుండా పోయింది!

విక్ర‌మ్ కెరీర్ నే ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేసేలా ఉన్నాయి ఈ సినిమా క‌లెక్ష‌న్లు. త‌మిళంలోనే ప‌ట్టుమ‌ని ప‌ది కోట్లు రాబ‌ట్ట‌డం క‌ష్టంగా మారుతోందంటే.. విక్ర‌మ్ త‌న క‌థ‌ల ఎంపిక‌ల‌ను పూర్తిగా అవ‌లోకనం చేసుకోవాల్సిన అవ‌స‌రాన్ని చాటుతోంది. ఇలాగే కొన‌సాగితే మాత్రం.. ఈ న‌టుడి కెరీర్ ఇక ముగిసే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?