cloudfront

Advertisement


Home > Movies - Movie News

‘బికినీలోనా.. అడిగుంటే చేసేదాన్ని కదా!’

‘బికినీలోనా.. అడిగుంటే చేసేదాన్ని కదా!’

పెళ్లి తర్వాత.. సినిమాల్లో నటించడానికి సిద్ధమే అని అంటోంది కలర్స్ స్వాతి. ఈ విషయంలో తన భర్తకు ఏ మాత్రం అభ్యంతరం లేదు అని.. “నీ తర్వాతి సినిమా ఎప్పుడు..’’అంటూ తన భర్త వికాస్ అడుగుతున్నాడు.. అని చెబుతోంది ఈ నటీమణి.

ఒక టీవీ షో ద్వారా పాపులర్ అయ్యి, ఆపై సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించుకున్న స్వాతి కొన్నాళ్ల కిందట వివాహిత అయ్యింది. ఇప్పుడు మళ్లీ సినిమాల మీద గాలి మళ్లిందో ఏమో కానీ... తన తాజా ఇంటర్వ్యూల్లో సినిమాలకు ఓకే అని చెబుతోంది.

పెళ్లి తర్వాత చాలా మంది నటీమణులు సినిమాలు మానేయడం మామూలే. అయితే తనకు మాత్రం అలాంటి పరిమితులు లేవని స్వాతి అంటోంది. పైపెచ్చూ పెళ్లి తర్వాత తనకు కొత్త స్వతంత్రం వచ్చిందని కూడా అంటోంది. ఇటీవల స్విమ్ సూట్లో తన ఫొటోలను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు అని.. తన భర్తకు ఏమీ ఆశ్చర్యం కలగలేదని స్వాతి అంటోంది.

తను చిన్నప్పటి నుంచి స్విమ్ చేస్తున్నాను అని.. ఎప్పుడైనా స్విమ్ సూట్ తోనే స్విమ్ చేస్తాం కదా.. అన్నట్టుగా మాట్లాడింది. ఒకవేళ ఎవరైనా మూవీ మేకర్లు తనను అలా నటించమని అడిగి ఉంటే.. తను అప్పుడే చేసేదాన్ని  అని కూడా స్వాతి చెప్పడం విశేషం.

ఇప్పుడు అలా నటించడానికి కూడా తన వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్వాతి చెబుతోంది. ఓవరాల్ గా తిరిగి సినిమాల్లో అవకాశాల కోసం స్వాతి చాలా ఆసక్తితోనే ఉందని ఆమె తాజా ఇంటర్వ్యూస్ తో స్పష్టం అవుతోంది. బహుశా అక్కా, వదిన పాత్రలకు స్వాతి సూట్ అయ్యే అవకాశాలున్నాయి.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు