cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ద‌య‌నీయ స్థితిలో హాస్య‌న‌టుడి మృతి

ద‌య‌నీయ స్థితిలో హాస్య‌న‌టుడి మృతి

త‌మిళ హాస్య న‌టుడు వ‌డివేల్ బాలాజీ (45) జీవితం విషాదాంత‌మైంది. స‌రైన వైద్యం తీసుకునే ఆర్థిక స్తోమ‌త‌లేక ఆయ‌న మ‌ర‌ణించ‌డం ప్ర‌తి ఒక్క‌ర్నీ క‌ల‌చివేస్తోంది.  గుండెపోటుకు గురైన ఆయ‌న చెన్నై గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం  తుది శ్వాస విడిచారు.

బాలాజీకి చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే విప‌రీత‌మైన ప్రేమ పెంచుకున్నాడు. విజ‌య్ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే ఓ కామెడీ షోతో బాలాజీ వెలుగులోకి వ‌చ్చాడు. త‌మిళ‌, తెలుగుతో పాటు ప‌లు భాషాల్లో క‌మెడియ‌న్‌గా పాపుల‌ర్ అయిన వ‌డివేలును బాలాజీ అనుక‌రిస్తూ అభిమానుల్ని సంపాదించుకున్నాడు. నాటి నుంచి ఆయ‌న వ‌డివేల్ బాలాజీకి అంద‌రూ పిలుచుకుంటున్నారు.

కొన్ని రోజుల క్రితం వ‌డివేల్ బాలాజీ గుండెపోటుకు గుర‌య్యాడు. దీంతో ఆయ‌న్ని చెన్నైలోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రికి కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. 15 రోజుల పాటు అక్క‌డ వైద్యం అందించినా ఎలాంటి పురోగ‌తి క‌నిపించ‌లేదు.

అంతేకాకుండా, ఆస్ప‌త్రి ఖ‌ర్చులు భ‌రించే ఆర్థిక స్తోమ‌త లేక‌పోవ‌డంతో చిన్న ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. అక్క‌డ కూడా ఖ‌ర్చులు భ‌రించ‌లేని ప‌రిస్థితి రావ‌డంతో కుటుంబ స‌భ్యులు చివ‌రి ప్ర‌య‌త్నంగా గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు.

వ‌డివేల్ బాలాజీని కాపాడేందుకు చెన్నై గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రి వైద్యులు శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నించారు. చివ‌రికి మృత్యువే జ‌యించింది.  మృతుడికి భార్య‌, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

నా ప్రెస్ మీట్ కోసం జనం ఎదురుచూసేవారు

 


×