బిగ్ బాస్ సీజన్-4.. కంటెస్టెంట్స్ వీళ్లే!

సీజన్-4లో భాగంగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారనే అంశంపై చాలా ఊహాగానాలు నడిచాయి. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరపడింది.  Advertisement నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ సీజన్-4 మొదలైంది.…

సీజన్-4లో భాగంగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎవరెవరు వెళ్లబోతున్నారనే అంశంపై చాలా ఊహాగానాలు నడిచాయి. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరపడింది. 

నాగార్జున హోస్టింగ్ తో బిగ్ బాస్ సీజన్-4 మొదలైంది. కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇదే ఆ లిస్ట్..

1. మోనాల్ గజ్జర్ – హీరోయిన్
2. సూర్యకిరణ్ – దర్శకుడు
3. లాస్య – యాంకర్
4. అభిజీత్ – నటుడు
5. సుజాత – న్యూస్ యాంకర్ (తెలంగాణ యాస)
6. మెహబూబ్ – యూట్యూబర్, డాన్సర్
7. దేవి – యాంకర్
8. హారిక – యూట్యూబ్ స్టార్ (దేత్తడి హారిక)
9. సయ్యద్ సోహైల్ – సీరియల్ నటుడు
10. అరియానా – యూట్యూబ్ యాంకర్
11. అమ్మ రాజశేఖర్ – కొరియోగ్రాఫర్, దర్శకుడు
12. కరాటే కల్యాణి – నటి
13. నోయల్ – సింగర్
14. దివి – మోడల్, నటి
15. అఖిల్ సార్థక్ – నటుడు
16. గంగవ్వ – యూట్యూబ్ స్టార్

వీళ్లలో ఎక్కువమందిని జనాలు గుర్తుపట్టారు కానీ.. కొంతమందిని మాత్రం నెటిజన్లు వెదుక్కోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా అఖిల్, సయ్యద్, దివి లాంటి వాళ్ల గురించి గూగుల్ లో వెదికినా దొరకలేదంటూ అప్పుడే కామెంట్స్ పడుతున్నాయి. కొంతమంది ఆల్రెడీ మీమ్స్ కూడా రెడీ చేశారు. 

మరోవైపు ఎప్పట్లానే నాగార్జున తన హోస్టింగ్ తో అదరగొట్టాడు. వయసుమళ్లిన ముసలాడి గెటప్ లో మరో నాగార్జున క్యారెక్టర్ ను కూడా ఇంట్రడ్యూస్ చేసి, మొదటి రోజు కాస్త బాగానే హంగామా చేసింది స్టార్ మా.  రేపట్నుంచి బిగ్ బాస్ హౌజ్ లో వీళ్ల పెర్ ఫార్మెన్సులు షురూ అవుతాయి. చూసినోడికి చూసుకున్నంత. 

కొంచెం కొత్తగా.. కొత్త పలుకు