Advertisement


Home > Movies - Movie News
జయప్రదను డాన్సర్ అన్న యూపీ నేత

మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదను ఓ డాన్సర్ గా అభివర్ణించారు సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేత ఆజామ్ ఖాన్. జయప్రద తనను అల్లావుద్దీన్ ఖిల్జీతో పోల్చినందుకు నిరసనగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.

"పద్మావత్ సినిమా వచ్చింది. అందులో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర చెడ్డదని తెలిసింది. నన్ను ఖిల్జీతో పోల్చుతూ ఓ డాన్సర్ నాపై విమర్శలు చేసింది. ఆడి పాడే ఆవిడ మాటలు వింటూ కూర్చోవాలా..? అలా చేస్తే రాజకీయాలపై నేను దృష్టిపెట్టగలనా?" అజాం ఖాన్ తాజా విమర్శలివి.

అజాంఖాన్ ను ఖిల్జీతో పోల్చారు జయప్రద. ఆయన తనను వేధించారని ఆరోపించారు. "పద్మావత్ లో ఖిల్జీని చూసినప్పుడు నాకు ఆజామ్ ఖాన్ గుర్తొచ్చారు. 2009 రాంపూర్ ఎన్నికల్లో నా పరువు తీయడానికి ఆయన అన్ని విధాలుగా ప్రయత్నించారు. అసభ్యకరమైన పోస్టర్లతో అప్రతిష్ట పాల్జేశారు." అంటూ ఆజామ్ పై విరుచుకుపడ్డారు జయప్రద.

ప్రస్తుతం వీళ్లిద్దరి వ్యవహారశైలి ఉత్తర్ ప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జయప్రదను డాన్సర్ గా పోల్చిన ఆజామ్ ఖాన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళా సంఘాలు. అటు ఆజామ్ ఖాన్ మద్దతుదారులు కూడా తమ నేతను ఖిల్జీతో పోల్చినందుకు జయప్రద క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.