Advertisement

Advertisement


Home > Movies - Movie News

దాదాసాహెబ్ ఫాల్కేను అందుకోనున్న ఆశా ప‌రేఖ్..!

దాదాసాహెబ్ ఫాల్కేను అందుకోనున్న ఆశా ప‌రేఖ్..!

భారతీయ సినిమా రంగంలో అత్యున్న‌త‌మైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2020 సంవ‌త్స‌రానికి గాను ప్ర‌ముఖ నటి ఆశా ప‌రేఖ్ ద‌క్కించుకున్న‌ట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్ప‌టికే సినిమా రంగానికి ఆమె చేసిన సేవ‌ల‌కు గాను 1992లో ప‌ద్మ‌శ్రీ అవార్డుతో భార‌త ప్ర‌భుత్వం స‌త్క‌రించింది.

ప‌ది సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే సినిమా రంగంలోకి ప్ర‌వేశించిన ఆశా ప‌రేఖ్ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది. 70- 80 ద‌శ‌కంలో ఆశాను క్యారెక్ట‌ర్ రోల్స్ అని పిలిచేవారు. దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్,రాజేష్ ఖన్నా లాంటి పెద్ద‌ నటులతో న‌టించింది. ఆశా పరేఖ్ గుజరాతీ, పంజాబీ, కన్నడ చిత్రాలలో కూడా పనిచేశారు.

2019గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రజనీకాంత్‌కు లభించింది. అవార్డు మొద‌టి సారిగా దేవికా రాణి అందుకోగా త‌రువాత రాజ్ కపూర్, యశ్ చోప్రా, లతా మంగేష్కర్, మృణాల్ సేన్, అమితాబ్ బచ్చన్ మరియు వినోద్ ఖన్నాలు లాంటి ప్ర‌ముఖుల‌తో పాటు తెలుగు నుండి బి.ఎన్.రెడ్డి, పైడి జైరాజ్, ఎల్.వి.ప్రసాద్, బి.నాగిరెడ్డి, ఎ.నాగేశ్వర రావు, డి.రామానాయుడు, కె.విశ్వనాథ్ లాంటి ప్ర‌ముఖులు అవార్డును అందుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?