Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫినిషింగ్ టచ్ కు అద్భుతమైన అవకాశం

ఫినిషింగ్ టచ్ కు అద్భుతమైన అవకాశం

ఏ ఏడాదిలో చూసుకున్నా బాక్సాఫీస్ కు ఇలాంటి అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశం రాలేదు. సినిమాలన్నీ సంక్రాంతికే క్యూ కడతాయి కాబట్టి ఆటోమేటిగ్గా డిసెంబర్ బోసిపోతుంది. కానీ ఈ ఏడాది డిసెంబర్ బాక్సాఫీస్ ఆషామాషీగా లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అదిరిపోయింది. ఇంకా చెప్పాలంటే, ఈ ఏడాది కరువు మొత్తాన్ని తీర్చేంత స్టఫ్ డిసెంబర్ బాక్సాఫీస్ కు ఉంది.  

ఈ నెలలో ఆల్రెడీ యానిమల్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. నాని, నితిన్ సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సలార్ కూడా రంగంలోకి దిగబోతోంది.

మిడ్ రేంజ్ హీరోల్లో నాని, నితిన్ కు మంచి హోల్డ్ ఉంది. వీళ్ల సినిమాలు క్లిక్ అయితే కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. నాని నటించిన హాయ్ నాన్న సినిమా 7వ తేదీన, ఒక రోజు గ్యాప్ లో నితిన్ నటించిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు థియేట్రికల్ గా 80 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేశాయి.

హాయ్ నాన్న, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ సినిమాల ట్రయిలర్స్ రెండూ హిట్టయ్యాయి. రెండు సినిమాలపై అంచనాలున్నాయి. వేర్వేరు జానర్స్ కావడంతో సినిమాల మధ్య పోటీ కూడా లేదు. కాబట్టి ఈ రెండు సినిమాలు క్లిక్కయితే బాక్సాఫీస్ కు పండగే.

ఈ రెండు సినిమాల తర్వాత వస్తున్న మూవీ సలార్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీపై భారీగా అంచనాలున్నాయి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే కళ్లుచెదిరే రేంజ్ లో ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తిచేసింది ఈ మూవీ.

సో.. నాని చెప్పినట్టు ఈసారి డిసెంబర్ నుంచే బాక్సాఫీస్ బరిలో సంక్రాంతి సీజన్ కనిపిస్తోంది. సినిమాలు హిట్టయితే మాత్రం ఈసారి భారీ కలెక్షన్లతో టాలీవుడ్ కళకళలాడడం పక్కా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?