దర్శకుడు మారుతి చాలా సరదాగా, చకచకా 30 రోజుల్లో తీసిన సినిమా 'మంచి రోజులు వచ్చాయి'. ఎస్కేఎన్ నిర్మాతగా తయారైన ఈ సినిమాను దసరా బరిలోకి దింపుదాం అనుకున్నారు. కానీ చాలా సినిమాలు వరుసగా వుండడంతో, డేట్ దొరకలేదు. ఆఖరికి దీపావళికి విడుదల డేట్ ను లాక్ చేసారు.
నవంబర్ 4న విడుదల అంటూ అనౌన్స్ చేసేసారు. ఈ నెల 15 వరకు చాలా సినిమాలు డేట్ లు ఇచ్చేసారు. 22, 29 తేదీలకు కూడా సినిమాలు వున్నాయి. అందుకే దీపావళికి డేట్ వేసారు.
అయితే బాలయ్య అఖండ సినిమా డేట్ ఇంకా రావాల్సి వుంది. రేట్లు వస్తే దీపావళికి బరిలోకి వస్తుందని టాక్ వుంది. అయితే కన్ ఫర్మ్ కాదు. ప్రస్తుతానికి అయితే ఇది ఒక్కటే సినిమా.
ఇప్పటికే మంచి రోజులు వచ్చాయి సినిమా నుంచి విడుదలయిన పాటల్లో రెండు పాపులర్ అయ్యాయి. మెహరీన్-సంతోష్ జంటగా నటించిన ఈ సినిమాను యువి కాన్సెప్ట్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు.