cloudfront

Advertisement


Home > Movies - Movie News

న‌గ్నంగా నిల‌బ‌డినా అడ్వాంటేజ్ తీసుకోడన్న దీపిక‌!

 న‌గ్నంగా నిల‌బ‌డినా అడ్వాంటేజ్ తీసుకోడన్న దీపిక‌!

పెళ్లితో ఒక‌టైన దీపికా ర‌ణ్ వీర్ లు ఇంట‌ర్నెట్ ట్రెండింగ్స్ లో కొన‌సాగుతూ ఉన్నారు. చాలా ర‌హ‌స్యంగా వీరి పెళ్లి జ‌రిగిపోయింది. పెళ్లికి ముందు వీరు ప‌బ్లిక్ గా తిరిగారు. త‌మ ఇంటి ప‌రిస‌రాల్లో రోడ్ల మీద కూడా క‌లిసి క‌నిపించారు. ఆయాచోట్ల వీళ్లు రొమాంటిక్ గా కూడా గ‌డిపారు.

త‌మ రిలేష‌న్ షిప్ గురించి ఏ మాత్రం దాచేయ‌కుండా... వీళ్లు ఓపెన్ గానే వ్యవ‌హ‌రించారు. దాని గురించి బ‌య‌ట‌కు మాట్లాడేవారు కాదు కానీ.. జంట‌గానే క‌లిసి తిరిగేవారు. అంత ఓపెన్ గా వ్యవ‌హ‌రించిన వీళ్లు పెళ్లి మాత్రం విదేశానికి వెళ్లి ర‌హ‌స్యంగా చేసేసుకున్నారు.

ఎందుకో అలా. ఆ సంగ‌త‌లా ఉంటే.. వీళ్లిద్దరూ త‌మ ప్రేమ‌బంధం గురించి, ఒక‌రిపై మ‌రొక‌రికి ఉన్న అభిప్రాయం గురించి ఇచ్చిన స్టేట్ మెంట్లు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అటు దీపిక‌, ఇటు ర‌ణ్ వీర్ ప‌ర‌స్పరం ఒక‌రి గురించి మ‌రొక‌రు ఇచ్చుకున్న స్టేట్ మెంట్స్ ఇవి. వాళ్లిద్దరూ ఒక‌రిపై మ‌రొక‌రికి ఉన్న ప్రేమను ఈ స్టేట్మెంట్స్ తో వ్యక్తీక‌రించారు.

అయితే దీపిక స్టేట్ మెంట్ చాలా బోల్డ్ గా ఉండ‌టం విశేషం. ర‌ణ్ వీర్ పై త‌న‌కు ఉన్న న‌మ్మకాన్ని, భ‌రోసాను ఈ విధంగా వ్యక్తీక‌రించిందామె. ఆ బోల్డ్ స్టేట్ మెంట్ ఏమిటంటే.. ర‌ణ్ త‌న విష‌యంలో ఏదీ గ్రాంటెడ్ అనుకోడు అని, త‌ను న‌గ్నంగా ఉన్నా త‌న‌ను హ‌ర్ట్ చేయ‌డు అని దీపిక వివ‌రించింది. అందుకే ర‌ణ్ విష‌యంలో త‌న‌కు భ‌రోసా అని ఆమె వివ‌రించింది.

ఇక ర‌ణ్ వీర్ దీపిక గురించి చెబుతూ.. ఆమె చాలా బ్యూటిఫుల్ అని, ఆమె కోసం జీవితాన్ని అంకితం చేయ‌గ‌ల‌న‌ని చెప్పాడు. ఇదీ ర‌ణ్ వీర్, దీపిక‌లు త‌మ ప్రేమ‌ను వ్యక్తీక‌రించుకున్న తీరు.

కమ్మ, రెడ్డి కలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్