22 కోట్లకు బంగ్లాను కొన్న స్టార్ హీరో,హీరోయిన్!

కరోనా క‌ష్టాలు, సినిమాల విడుద‌ల‌లు ఆగ‌డాలు, కొత్త సినిమాలు ప‌ట్టాలెక్క‌డం డిలే కావ‌డాలు.. ఇవేవీ సినిమా తార‌ల ఆర్థిక శ‌క్తిని హ‌రించి వేస్తున్న‌ట్టుగా లేదు. రోజుకొక‌రు భారీ కొనుగోళ్ల వార్త‌ల్లో ఎక్కుతున్నారు. ఖ‌రీదైన కార్లు,…

కరోనా క‌ష్టాలు, సినిమాల విడుద‌ల‌లు ఆగ‌డాలు, కొత్త సినిమాలు ప‌ట్టాలెక్క‌డం డిలే కావ‌డాలు.. ఇవేవీ సినిమా తార‌ల ఆర్థిక శ‌క్తిని హ‌రించి వేస్తున్న‌ట్టుగా లేదు. రోజుకొక‌రు భారీ కొనుగోళ్ల వార్త‌ల్లో ఎక్కుతున్నారు. ఖ‌రీదైన కార్లు, భారీ ఆస్తుల కొనుగోలుతో సినిమా తార‌లు వార్త‌ల్లో నిలుస్తున్నారు. 

ఈ క్ర‌మంలో బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ క‌మ్ భార్యాభ‌ర్త‌లు అయిన దీపికా, ర‌ణ్ వీర్ లు మ‌రో భారీ ప్రాప‌ర్టీని కొనుగోలు చేశారు. ఏకంగా 22 కోట్ల రూపాయ‌లు వెచ్చించి వారు ఒక బంగ్లాను కొనుగోలు చేసిన‌ట్టుగా స‌మాచారం.

సౌత్ ముంబైలో ని కోస్ట‌ల్ టౌన్ అలీబాగ్ ఏరియాలో వారు ఈ ప్రాప‌ర్టీని కొనుగోలు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ ప్రాంతం లో ఇది వ‌ర‌కే బాలీవుడ్ స్టార్లు ఆస్తుల‌ను క‌లిగి ఉన్నారు. ఇప్పుడు దీపికా, ర‌ణ్ వీర్ లు కూడా ఈ కొనుగోలుతో అక్క‌డ అడుగుపెడుతున్నారు.. ప్ర‌స్తుతం వీరు  దీపిక సొంత ఫ్లాట్ లో నివ‌సిస్తూ ఉంటారు. 2010లో దీపిక కొనుగోలు చేసిన ఫ్లాట్ లోనే వీరి కాపురం సాగుతూ ఉంది. ఇప్పుడు రెండో ఇంటి కొనుగోలు చేశారు.

వీరి కొత్త బంగ్లా ఏకంగా 2.25 ఎక‌రాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంద‌ట‌. అందులో కొంత నిర్మాణం జ‌రిగిన ఏరియా కాగా, మిగిలిన‌ది ఖాళీ ప్ర‌దేశం. భారీ రెమ్యూనిరేష‌న్ల‌తో కూడా ఈ భార్యాభ‌ర్త‌లు వార్త‌ల్లో నిలుస్తూ  ఉంటారు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న హీరో, హీరోయిన్లుగా ఎవ‌రికి వారు రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ క్ర‌మంలో భారీ స్థాయి ఆస్తుల‌ను కూడా కొనుగోలు చేస్తున్నారు.