Advertisement


Home > Movies - Movie News
నేను సేఫ్.. అందరికీ థ్యాంక్స్

దీపిక పదుకోన్ కు తీవ్ర గాయాలయ్యాయట
అపార్ట్ మెంట్ లో ఆమె ఫ్లాట్ పూర్తిగా కాలిపోయిందట

ఇలా దీపిక పదుకోన్ పై కొన్ని గంటలుగా పుకార్లు షికార్లు చేశాయి. ఎట్టకేలకు వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. తను క్షేమంగా ఉన్నానని ప్రకటించింది. తనకు ఏం కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఇంత సడెన్ గా దీపికపై ఇలాంటి రూమర్లు రావడానికి ఓ రీజన్ ఉంది. ముంబయిలో ఆమె నివశిస్తున్న అపార్ట్ మెంట్ లోని 32వ అంతస్తులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. నగరంలోని ప్రభాదేవి ప్రాంతంలో ఉన్న అత్యంత ఖరీదైన అపార్ట్ మెంట్ ఇది. కాకపోతే దీపిక ఉంటున్న అపార్ట్ మెంట్ వరకు మంటలు వ్యాపించలేదు.

ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, తన గురించి ఆందోళన చెందిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది దీపిక. ప్రాణాలకు తెగించి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించిన అగ్నిమాపక సిబ్బందికి అభినందనలు తెలిపింది. అగ్నిమాపక సిబ్బందికి ఏం కాకుండా అంతా ప్రార్థించాలని కోరింది.

నిజానికి అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగిన టైమ్ లో ఫ్లాట్ లో దీపిక పదుకోన్ లేదు. మిగతా ఫ్లాట్స్ లో ఉంటున్న దాదాపు వంద మంది వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అపార్ట్ మెంట్ భద్రతా ప్రమాణాలపై దీపిక ఆరా తీసింది.