Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరోయిన్లతో కళకళలాడిన ఎన్సీబీ

హీరోయిన్లతో కళకళలాడిన ఎన్సీబీ

ఈ రోజంతా ముంబయిలోని 2 ఎన్సీబీ ఆఫీసులు ముద్దుగుమ్మలతో కళకళలాడాయి. ఒక చోట హీరోయిన్ దీపిక పదుకోన్ విచారణకు హాజరవ్వగా.. మరో ఆఫీస్ లో శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ విచారణకు వచ్చారు. ఈరోజు వీళ్ల ముగ్గుర్ని ప్రాధమికంగా ప్రశ్నించిన అధికారులు ఇంటికి పంపించారు.

ముందుగా దీపిక పదుకోన్ విషయానికొద్దాం. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎన్సీబీ ఆఫీస్ కు చేరుకున్న దీపికను అధికారులు ఏకథాటిగా 5 గంటల పాటు ప్రశ్నించారు. మధ్యలో 30 నిమిషాలు మాత్రమే బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ విచారణలో అధికారులకు దీపిక పెద్దగా సహకరించలేదని టైమ్ నౌ ఛానెల్ ప్రకటించింది. 2017లో జరిపిన డ్రగ్స్ ఛాట్స్ తనవే అని అంగీకరించిన దీపిక.. పార్టీలో డ్రగ్స్ తీసుకుందా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని సదరు ఛానెల్ తెలిపింది.

ఇక శ్రద్ధాకపూర్ విషయానికొస్తే.. సుశాంత్ తన ఫామ్ హౌజ్ లో ఇచ్చిన పార్టీకి వెళ్లిన విషయాన్ని శ్రద్ధాకపూర్ ధృవీకరించింది. కాకపోతే తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణల్ని మాత్రం పూర్తిగా ఖండించినట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎన్సీబీ ఆఫీస్ కు చేరుకున్న శ్రద్ధాకపూర్ ను కొద్దిసేపటి కిందటివరకు అధికారులు ప్రశ్నించారు. ఆమెతో దాదాపు 60 ప్రశ్నలున్న పేపర్ పై సమాధానాలు రాయించినట్టు తెలుస్తోంది.

అటు సారా అలీఖాన్ విచారణ కూడా పూర్తయింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆఫీస్ కు చేరుకున్న సారాను అధికారులు దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించారు. సారా కూడా సుశాంత్ తో పలు పార్టీలకు హాజరైన విషయాన్ని అంగీకరించినప్పటికీ.. తను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని చెప్పిందట.

ఇక ఈ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్న క్షితిజ ప్రసాద్, అనుభవ్ చోప్రాలను అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా 20 గంటల పాటు వీళ్లను విచారించిన అధికారులు, మరింత కీలక సమాచారాన్ని రాబట్టారు. విచారణలో రకుల్ ప్రీత్ క్షితజ ప్రసాద్ పేరును బయటపెట్టినట్టు తెలిపిన జాతీయ మీడియా... ఇవాళ్టి విచారణలో ప్రసాద్-అనుభవ్ ఇద్దరూ మరింతమంది పేర్లను బయటపెట్టినట్టు చెప్పుకొచ్చింది. వీళ్లిద్దరూ గతంలో కరణ్ జోహార్ సంస్థలో పనిచేశారు.

నాకు జగన్ ఇచ్చిన గౌరవం అది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?