cloudfront

Advertisement


Home > Movies - Movie News

దేవదాస్.. టూ ఫన్నీ యార్

దేవదాసు అంటే జనాలకు ట్రాజెడీ నే. విషాదాంత ప్రేమకథ అది. కానీ ఆ టైటిల్ లో తీస్తున్న దేవదాస్ మాత్రం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ గా వుండేలా కనిపిస్తోంది. అమాయకుడైన డాక్టర్ గా నాని, గ్యాంగ్ స్టర్ గా నాగ్ కలిసి చేసిన నవ్వుల విందుగా ఈ దేవదాస్ ను తీసినట్లు విడుదలయిన ట్రయిలర్ చూస్తుంటే క్లియర్ అయిపోతోంది.

సినిమా నాలుగు భాగాలుగా వుండేలా ట్రయిలర్ కంటెంట్ చెప్పకనే చెబుతోంది. నాగ్ పేషంట్ గా పరిచయమై, నాని నెత్తిన ఎక్కి సవారి చేస్తూ, నవ్వులు పూయించడం, అదే టైమ్ లో నాని-రష్మిక లవ్ స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ లో నాగ్ లవ్ స్టోరీ, ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాక సినిమా పతాక స్థాయికి చేరుకోవడం. 

నాలుగు భాగాల్లో మొదటిదైన నాగ్-నానిల డాక్టర్ పేషెంట్ వ్యవహారం బాగా నవ్వులు పూయించేలా కనిపిస్తోంది. అలాగే నాని లవ్ ట్రాక్ ఫన్ తో, నాని లవ్ ఫన్ ట్రాక్ కూడా ఎంటర్ టైన్ చేసేలాగే కనిపిస్తున్నాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్ ల దగ్గర పెద్దగా కొత్తదనం వుండకపోవచ్చు.టోటల్ గా ట్రయిలర్ చూస్తుంటే, అన్నీ మిక్స్ చేసిన మిక్చర్ పొట్లాంలా కనిపిస్తోంది.