Advertisement

Advertisement


Home > Movies - Movie News

డెవిల్ అడ్డంకులు తొలిగాయి

డెవిల్ అడ్డంకులు తొలిగాయి

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా డెవిల్. ఆసక్తికరమైన పీరియాడికల్ సినిమా ఇది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ గూఢచారిగా కనిపిస్తారు. ఈ సినిమా టీజర్ కు మాంచి రెస్పాన్స్ వచ్చింది.

కానీ ఈ సినిమాకు ఆరంభంలో దర్శకుడిగా పని చేసిన నవీన్ మేడారంతో నిర్మాతకు పొసగలేదు. అక్కడి నుంచి అభిషేక్ నామా సినిమాకు వర్క్ చేసుకున్నారు. కానీ ఈ పాయింట్ వల్ల సినిమా నాన్ థియేటర్ హక్కులు కాస్త వివాదంలో పడ్డాయి. దాంతో సినిమా విడుదల ఆలస్యమైంది.

ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయింది. నాన్ థియేటర్ హక్కులు అన్నీ పూర్తిగా మార్కెట్ చేసుకున్నారు. లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించింది. యానిమల్ తో అందరి దృష్టిని ఆకర్షించిన మ్యూజిక్ డైరక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు పని చేసారు. అన్ని పనులు పూర్తి కావడంతో ఈ నెల 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ నెల రెండో వారం తరువాత ట్రయిలర్ ను విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచి సినిమా ప్రమోషన్ వర్క్ మొదలుపెడతారు. బింబిసార సక్సెస్ తరువాత కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఈ సినిమా మీద ఆశలు గట్టిగా పెట్టుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?