cloudfront

Advertisement


Home > Movies - Movie News

దిల్ రాజు బ్యానర్ లో ఆ సినిమా కూడా ఆగిపోయింది

దిల్ రాజు బ్యానర్ లో ఆ సినిమా కూడా ఆగిపోయింది

ఒక్కసారి కథ, స్క్రీన్ ప్లే ఫిక్స్ అయిపోతే వెనక్కి తిరిగి చూడడు దిల్ రాజు. కానీ ఈసారి మాత్రం ఈ నిర్మాత లెక్కలేసుకుంటున్నాడు. ఓవైపు ఎఫ్2 రూపంలో భారీ సక్సెస్ అందుకున్నప్పటికీ అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే హరీష్ శంకర్ తో చేయాల్సిన దాగుడు మూతలు ప్రాజెక్టును పక్కనపెట్టిన దిల్ రాజు, తాజాగా ఇప్పుడు మరో సినిమాను కూడా ఆపేశాడు.

లెక్కప్రకారం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఎస్వీసీ బ్యానర్ పై ఓ సినిమా చేయాలి దిల్ రాజు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ కూడా పూర్తయిందని ప్రకటించాడు దర్శకుడు. కానీ ఇప్పుడా సినిమా రావట్లేదు. ఇంద్రగంటి మూవీని పూర్తిగా పక్కనపెట్టాడు దిల్ రాజు. అది మల్టీస్టారర్ కథ కావడం, బడ్జెట్ కూడా భారీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.

అలా అని ఇంద్రగంటిని వదులుకోలేదు దిల్ రాజు. అతడి వద్ద నాని కాల్షీట్లు రెడీగా ఉన్నాయి. 96 సినిమా చేయనని తప్పుకున్న నానిని, ఇంద్రగంటితో ఎటాచ్ చేశాడు దిల్ రాజు. వాళ్లిద్దరూ కలిసి ఓ కథకు ఓకే చెబితే దాన్ని తన బ్యానర్ పై తీయడానికి రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని-ఇంద్రగంటి అదే చర్చల్లో ఉన్నారు.

మొత్తమ్మీద దిల్ రాజు ఇప్పుడు భారీ సినిమాలకు దూరమయ్యాడన్నమాట. రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఒకేసారి 2 మల్టీస్టారర్ ప్రాజెక్టుల్ని పక్కనపెట్టేశాడు. వీటి స్థానంలో త్వరలోనే రాజ్ తరుణ్ హీరోగా ఓ కొత్త దర్శకుడితో ఓ చిన్న బడ్జెట్ సినిమా తీయబోతున్నాడు.

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా