cloudfront

Advertisement


Home > Movies - Movie News

దిల్ రాజు చేతుల్లో 'సూర్యకాంతం'

దిల్ రాజు చేతుల్లో 'సూర్యకాంతం'

హీరో వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సంస్థ నిర్మిస్తున్న సినిమా మిసెస్ సూర్యకాంతం. ఈ సినిమాలో కొణిదెల నీహారిక కీలకపాత్ర పోషిస్తుండగా, ఆమె సరసన రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. ప్రవీణ్ దర్శకుడు. ఈ సినిమా కు ఇప్పటి దాకా వదిలిన పబ్లిసిటీ మెటీరియల్ కు మాంచి అప్లాజ్ నే వచ్చింది.

లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ఈ సినిమాను తీసుకెళ్లి ఏస్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు చేతిలో పెట్టారు. సినిమాను ఏరియాల వారీ అమ్మే ఆలోచన పక్కన పెట్టి, స్వంతగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలని డిసైడ్ అయి, ఈ మేరకు దిల్ రాజకు సినిమాను అప్పగించారు. 

రిటర్న్ బుల్ నామినల్ అడ్వాన్స్ ప్రాతిపదికన పంపిణీకి ఆయన సినిమాను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉభయ తెలుగురాష్ట్రాల్లోనూ దిల్ రాజు నెట్ వర్క్ ద్వారా ఈ సినిమా విడుదలవుతుంది. మార్చి 29న విడుదలవుతున్న ఈ సినిమాకు కాంఫిటీషన్ అదే రోజు విడుదలవుతున్న అర్జున్ సురవరం. ఆ సినిమా నిఖిల్ హీరో.