Advertisement

Advertisement


Home > Movies - Movie News

'దిల్ రాజు కాదు కిల్ రాజు'

'దిల్ రాజు కాదు కిల్ రాజు'

పండగ సీజన్ వచ్చినపుడల్లా, వరుస సెలవులు దొరికినపుడల్లా ధియేటర్ గొడవలు ప్రారంభం కావడం మామూలు అయిపోయింది. ఇలా గొడవలు వచ్చినపుడల్లా దిల్ రాజు పేరు బయటకు వస్తూ వుంటుంది. నిజానికి పేరు దిల్ రాజుది కానీ తెరవెనుక థియేటర్ల వ్యవహారం ఆడించేది శిరీష్. ఆ సంగతి అందరికీ తెలిసినా, దిల్ రాజు పేరు మాత్రమే బయటకు వినిపిస్తూ వుంటుంది.

ఈ పండగ కు కూడా నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిల్లో విజయ్ మాస్టర్, అల్లుడు శీను రెడ్ సినిమాలును  నైజాం ల్లో దిల్ రాజు నే పంపిణీ చేస్తున్నారు. అలాగే మాస్టర్, రెడ్ సినిమాలు వైజాగ్ కూడా ఆయనే పంపిణీ చేస్తున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో విజయ్ మాస్టర్ సినిమా కోసం దిల్ రాజు మిగిలిన వారికి థియేటర్లు అందకుండా చేస్తున్నారని విమర్శలు వినిపించడం ప్రారంభమైంది. పైగా గతంలో తన సినిమా విడుదల సంక్రాంతికి వున్నపుడు డబ్బింగ్ సినిమాల మీద దిల్ రాజు ధ్వజమెత్తారు. ఆనాటి ఆయన ప్రసంగాన్ని, ఆ విడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ కబుర్లు ఇప్పుడు ఏమయ్యాయని కామెంట్ చేస్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో క్రాక్ సినిమాను నైజాంలో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కాస్త గట్టిగానే దిల్ రాజుపై విమర్శలు కురిపించారు.

రవితేజ హీరోగా నటించిన క్రాక్ చిత్రం జనవరి 9న విడుదలై సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ టైములో కమిట్ అయిన ధియేటర్స్ అన్నీ తీసివేసి ఒక డబ్బింగ్ సినిమా మాస్టర్ కి దిల్ రాజు, శిరీష్ రెడ్డి ఎక్కువ ధియేటర్స్ ఇచ్చారని వరంగల్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు, జనసేన పార్టీ రాష్ట్ర విద్యార్థి భాగం అధ్యక్షుడు సంపత్ నాయక్ పాల్గొన్నారు. 

నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా అంటే పిచ్చి నాకు.  సినిమా ఫీల్డ్ కి వెళ్లి ఏదో ఒకటి చెయ్యాలని సినిమా ఇండస్త్రీకి వచ్చాను. కథలు పట్టుకొని డైరెక్షన్ ఛాన్స్ కోసం తిరిగాను. అవకాశాలు రాక డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. పదిహేను ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో వున్నాను. ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ నైజాంలో రిలీజ్ చేశాను. 

ఇప్పుడు లేటెస్ట్ గా క్రాక్ మూవీ రిలీజ్ చేశాను. బ్లాక్ బస్టర్ హిట్ అయి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ టైములో మా సినిమా తీసివేసి మాస్టర్ సినిమాకి ధియేటర్స్ ఇచ్చారు. ఒకప్పుడు తమిళ్ సినిమాలకి ధియేటర్స్ ఇవ్వొద్దు. తెలుగు సినిమాలకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని స్టేజ్ ల మీద స్పీచ్ లు ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట తప్పారు.

స్వాతంత్ర్య పోరాటం మాదిరిగా ఇప్పుడు ఒక విప్లవం రావాలి. ఎందుకంటే నైజాంలో ధియేటర్స్ విషయంలో దిల్ రాజు, శిరీష్ రెడ్డి  గుత్తాధిపత్యాన్ని పెత్తనాన్ని కొనసాగిస్తుంన్నారు. వారి నిరంకుశపాలనకి అడ్డుకట్ట వేసే దిశగా నా పోరాటం కొనసాగిస్తాను. 

ఎగ్జిబిటర్స్ ని బెదిరించి ధియేటర్స్ ఆక్యుపే చేసి డిస్ట్రిబ్యూటర్స్ అందర్నీ నానా ఇబ్బందులు పెడుతున్నారు. తన సినిమాకి ఒకలా బయట వాళ్ళ సినిమాకి ఇంకోలా చేస్తూ.. తన సినిమా పదివేలు కలెక్షన్ ఉంటే తీయవద్దు అంటాడు. పక్కోడి సినిమా లక్షరూపాయల కలెక్షన్ ఉంటే తీసివేస్తారు . 

ఈరోజు మా క్రాక్ ఆడుతున్న మేజర్ సెంటర్స్ లలో 80 ధియేటర్స్ తీసివేసి మాస్టర్ మూవీకి ఇచ్చారు. క్రాక్ లాంటి హిట్ సినిమాకి శిరీష్ రెడ్డి కిల్ రాజు తన నియంతృత్వ ధోరణితో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్స్ లేకుండా చేశారు. అదేంటి అని అడిగితే రెస్పెక్ట్ లేకుండా ఎరా..పోరా అని పదిమందిలో అవమానించారు. ఎంతో కాలంగా ఓపికతో వారి అరాచకాలను భరిస్తూ వచ్చాను. ఇక నాకు ఓపిక నశించి పోయింది. తెలంగాణ దిల్ రాజు జాగీర్ కాదు.

మూడుపూటలు మేమే తినాలి అంటే కుదరదు. ఎదుటి వారికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి.  అందరూ బతకాలి. అందరికీ సమానంగా ధియేటర్స్ ఇవ్వాలి. అది వచ్చేదాకా నా పోరాటం ఆగదు. మా జోలికి రావద్దు. మా సినిమాలు వేసినా కూడా  మాకు సరిపడే  ధియేటర్స్  ఇవ్వండి అని మిమ్మల్ని బ్రతిమిలాడుకోవటం ఏంటి. మీరు నైజాం  డిస్ట్రిబ్యూటరే నేనూ నైజాం  డిస్ట్రిబ్యూటర్నే. మీరూ నిర్మాతే నేను నిర్మాతనే . మీరు ఇప్పటినుండి దిల్ రాజు కాదు కిల్ రాజువి. 

నిర్మాతలకు తప్పుడు లెక్కలు చూపించి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు వారిని చంపేస్తున్నారు .  ఆ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. ఈ విషయం ఎవరో ఒకరు చెప్పాలి, గళం విప్పాలి అందుకే నేను ఈ రోజు ఈ విషయం చెబుతున్న. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నా దగ్గర డబ్బుతో పాటు నిజాయితీ ఉంది. ఆ నిజాయితీతో దేనినైనా గెలవచ్చు అనేది నా సిద్ధాంతం.

థియేటర్స్ ఉన్నాయి కదా అని నిర్మాతల దెగ్గర సినిమాలను తెచ్చుకుంటారు.  బెదిరించి కొత్త డిష్టిబ్యూటర్స్ ను ఎదగనివ్వకుండా తొక్కేస్తావు ఎందుకంటే వారు నైజాం లో నీకంటే పై స్థాయికి వెళతారు కావున. అందుకే నువ్వు దిల్ రాజు కాదు కిల్ రాజు...అంటూ వరంగల్ శ్రీను నిప్పులు చెరిగారు.

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?