Advertisement

Advertisement


Home > Movies - Movie News

వకీల్ సాబ్ లో పవన్ ఎంట్రీ ఎప్పుడు?

వకీల్ సాబ్ లో పవన్ ఎంట్రీ ఎప్పుడు?

పింక్ సినిమాలో అమితాబ్ క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉంటుంది. మరి పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ లో పవన్ కల్యాణ్ పాత్ర కూడా అంతే తక్కువగా ఉంటుందా? దీనికి సంబంధించి చాలా ఊహాగానాలు చెలరేగాయి. సినిమాలో పవన్ అటుఇటుగా గంటకు మించి కనిపించడని కొందరు.. సినిమా స్టార్ట్ అయిన అరగంట వరకు పవన్ కల్యాణ్ రాడని ఇంకొందరు తమకుతోచిన విధంగా చెప్పుకొచ్చారు.

ఎట్టకేలకు ఈ అంశంపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. మరికొన్ని గంటల్లో వకీల్ సాబ్ థియేటర్లలోకి వస్తుందనగా.. సినిమాలో పవన్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చాడు రాజు.

"సినిమాలో పవన్ ఎంత సేపు ఉన్నాడనే కొలతలు కొలవలేదు. కానీ కథ స్టార్ట్ అవ్వాలి కాబట్టి మూడు లీడ్ పాత్రలు ముందుగా వస్తాయి. ఆ తర్వాత 15 నిమిషాలకు పవన్ కల్యాణ్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ్నుంచి కథ ప్రకారం మధ్యమధ్యలో హీరో వస్తూ ఉంటాడు."

ఇలా వకీల్ సాబ్ లో పవన్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు దిల్ రాజు. అయితే సినిమా మొత్తం పవన్ ఎంత సేపు కనిపిస్తాడనే విషయంపై మాత్రం దిల్ రాజు సమాధానం దాటేశాడు. పవన్ ఎంతసేపు ఉంటాడనే విషయాన్ని పక్కనపెడితే.. ఆయన ఎంట్రీ మాత్రం అదిరిపోతుందంటున్నాడు.

"హీరో ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది. సీట్లలో ఎవ్వరూ కూర్చోరు. ఆ రేంజ్ లో ఉంటుంది. ఇక సినిమా విషయానికొస్తే, వకీల్ సాబ్ లో ప్రతి 15 నిమిషాలకు ఓ హై ఉంటుంది."

ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది వకీల్ సాబ్ సినిమా. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్, వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇస్తున్నాడు. లాక్ డౌన్ తర్వాత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇదే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?