Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆశిష్ కు లైనప్ సెట్ చేస్తున్న రాజు

ఆశిష్ కు లైనప్ సెట్ చేస్తున్న రాజు

తన ఫ్యామిలీ హీరో ఆశిష్ కోసం అన్నీ తానై వ్యవహరించారు దిల్ రాజు. రౌడీ బాయ్స్ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేశారు. అయితే థియేటర్లలో ఆశిష్ మొదటి సినిమాకు చెప్పుకోదగ్గ రెస్పాన్స్ రాలేదు. 5 రోజుల్లో 7 కోట్ల గ్రాస్ వచ్చిందంటూ మేకర్స్ చెప్పుకున్నప్పటికీ ఆడియన్స్ నుంచి ఆ స్థాయి స్పందన కనిపించలేదు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఆశిష్ కెరీర్ పై పూర్తిస్థాయిలో దిల్ రాజు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా అతడి రెండో సినిమాను సుకుమార్ శిష్యుడి చేతిలో పెట్టారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన కాశి, ఆశిష్ రెండో సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు

సుకుమార్-దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో ఆశిష్, కొత్త తరహాలో కనిపిస్తాడట. బన్నీకి ఆర్య సినిమా ఎలా టర్నింగ్ పాయింట్ అయిందో, ఆశిష్ కు ఈ కొత్త సినిమా అలాంటి టర్నింగ్ పాయింట్ అంటున్నారు. 

ఆశిష్ మూడో సినిమాను కూడా తన సొంత బ్యానర్ పైనే సెట్ చేశాడు దిల్ రాజు. బొమ్మరిల్లు తరహాలో లవ్, ఫ్యామిలీ సబ్జెక్ట్ ను రెడీ చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?