డిజాస్టర్లు ఇచ్చినా ఇంకా బుద్ధి మారలేదు

“సినిమాల పోస్టర్ల మీద నీ ఫొటోలు వేయడం ఆపు, హీరోల ఫొటోలు వేస్తే కొంతమందైనా సినిమాకొస్తారు.” ఆంజనేయులు సినిమాలో నిర్మాత పాత్ర పోషించిన ఎమ్మెస్ నారాయణపై హీరో రవితేజ వేసిన సెటైర్ అది. అప్పట్లో…

“సినిమాల పోస్టర్ల మీద నీ ఫొటోలు వేయడం ఆపు, హీరోల ఫొటోలు వేస్తే కొంతమందైనా సినిమాకొస్తారు.” ఆంజనేయులు సినిమాలో నిర్మాత పాత్ర పోషించిన ఎమ్మెస్ నారాయణపై హీరో రవితేజ వేసిన సెటైర్ అది. అప్పట్లో ఆ సెటైర్ ఎలా పుట్టుకొచ్చిందో చాలామందికి తెలుసు.

కొంతమంది దర్శకుల అత్యుత్సాహం హీరోల్ని మించిపోతుంది. హీరో కంటే తమకే ఎక్కువ పేరు రావాలనే కుతి వీళ్లలో ఎక్కువ కనిపిస్తుంది. గతంలో ఓ దర్శకుడు ఇలానే చాలా హంగామా చేసి తలబిరుసు ఎక్కువనే విమర్శలు మూటగట్టుకున్నాడు.

ఆ తర్వాత అదే దర్శకుడు వరుసపెట్టి ఫ్లాపులిచ్చాడు, ఆల్ మోస్ట్ ఫేడవుట్ అయిపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు రాకరాక ఓ అవకాశం వచ్చింది. దాన్ని అతడు సద్వినియోగం చేసుకుంటాడని అంతా భావించారు. అయితే గతంలో ఏ విషయంపై విమర్శలు కొనితెచ్చుకున్నాడో, ఇంకా ఆ బుద్ధి వీడినట్టు లేదు ఈ డైరక్టర్.

ఇప్పటికీ వర్కింగ్ స్టిల్స్ పేరిట తన ఫొటోల్నే రిలీజ్ చేస్తున్నాడు. హీరో ఉన్న స్టిల్ ఒక్కటి రిలీజైతే, ఇతగాడు ఉన్నవి 4 రిలీజ్ అవుతున్నాయి. స్టార్ డైరక్టర్ అయితే ఆ లెక్క వేరు. వరుసగా ఫ్లాపులిచ్చి మరీ ఇప్పుడిలా ఆన్-లొకేషన్ లో ఫొటోలకు పోజులిస్తుంటే యూనిట్ లో జనాలే విసుక్కుంటున్నారు.