cloudfront

Advertisement


Home > Movies - Movie News

డైరక్టర్ జయ కన్నుమూత

డైరక్టర్ జయ కన్నుమూత

జర్నలిస్ట్, రచయిత, సినీ దర్శకురాలు ఆర్ జయ మరణించారు. టాలీవుడ్ జర్నలిస్ట్ లోని సీనియర్లలో ఆమె ఒకరు.  వెస్ట్ గోదావరికి చెందిన జయ రచయితగా ఆపై జర్నలిస్ట్ గా సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ తరువాత సూపర్ హిట్ పేరిట స్వంత సినిమా పత్రికను ప్రారంభించారు. 

అప్పట్లో డైనమిక్ లేడీ ఫిలిం జర్నలిస్ట్ గా జయ పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆమె డైరక్టర్ గా మారారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ, వైశాఖం వంటి క్లీన్ ఫ్యామిలీ యూత్ సినిమాలు అందించారు. 

వైశాఖం సినిమా టైమ్ లోనే ఆమె కాస్త అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవలే తేరుకుని మళ్లీ మరో సినిమా అందించేందుకు స్క్రిప్ట్ డిస్కషన్ పనులు ప్రారంభించారు.కానీ అంతలోనే మృత్యువు కబళించింది. 

జయ అంటే ఆమే భర్త బిఎ రాజకు చాలా అభిమానం. తన భార్యను టాప్ డైరక్టర్ గా చేయాలన్నది ఆయన కోరిక. కేవలం తన భార్య కోసమే బ్యానర్ ను ప్రారంభించారు ఆయన.  పిఆర్ఓ నుంచి నిర్మాతగా మారింది తన భార్య కోసమే అని చెబుతూ వుండేవారు.

గ్యాలరీ కోసం క్లిక్ చేయండి