Advertisement

Advertisement


Home > Movies - Movie News

తగ్గేదేలే.. 'సాగదీత'పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

తగ్గేదేలే.. 'సాగదీత'పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

'అంటే సుందరానికి' సినిమాకు సంబంధించి అంతా ముక్తకంఠంతో చేసిన విమర్శ ఒకే ఒక్కటి. ఈ సినిమా నిడివి ఎక్కువైందనేది అందరి కామన్ కామెంట్. రిలీజైన మొదటి రోజు మొదటి ఆటకే ఈ విమర్శ వచ్చింది. దీంతో వీకెండ్ నాటికి సినిమా రన్ టైమ్ తగ్గిస్తారని అంతా ఎదురుచూశారు. కానీ మేకర్స్ మాత్రం 'తగ్గేదేలే' అంటున్నారు.

ఈరోజు 'అంటే సుందరానికి' సినిమాకు సంబంధించి 'సుందర్స్ సెలబ్రేషన్' పేరిట సక్సెస్ మీట్ ఏర్పాటుచేశారు. ఈ వేదికపై దర్శకుడు వివేక్ ఆత్రేయ, తన సినిమా రన్ టైమ్ పై స్పందించాడు. రన్ టైమ్ తగ్గించే ఆలోచన తమకు అస్సలు లేదని స్పష్టం చేశాడు.

"ఈ సినిమాను ఈ నిడివిలోనే చెప్పాలని మేమంతా నిర్ణయించుకున్నాం. సెకండాఫ్ చాలా బాగుంది, ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతుందని అంటున్నారు. సెకెండాఫ్ ను ఫాస్ట్ గా తీయడం తెలిసిన నాకు, ఫస్టాఫ్ ను ఫాస్ట్ గా తీయడం తెలియక కాదు. సెకెండాఫ్ లో ఎంజాయ్ చేసే ప్రతి మూమెంట్ కు కారణం ఫస్టాఫ్ వల్లనే. కాబట్టి ఈ సినిమాను ఇలానే చూడాలి. ఇలానే ఎంజాయ్ చేయాలి."

సుందర్-లీల పాత్రలు పెద్దయ్యాక ప్రేమలో పడడం కామన్. కానీ సినిమాలో వాళ్లు చిన్నప్పట్నుంచి ఒకరికొకరు తెలుసని, వాళ్ల గ్రోత్, ఒకర్నొకరు ఎలా అంగీకరించారనేది చూపించాం కాబట్టి.. ఆ మాత్రం టైమ్ తీసుకోవడంలో తప్పు లేదంటున్నాడు దర్శకుడు. ఈ సినిమాకు ఈ నిడివి అవసరమని గట్టిగా చెబుతున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?