cloudfront

Advertisement


Home > Movies - Movie News

బన్నీ కథలు చెప్పించుకుంటాడు.. ఓకే చెప్పడు

బన్నీ కథలు చెప్పించుకుంటాడు.. ఓకే చెప్పడు

"బన్నీకి నేను చెప్పే కథలంటే చాలాఇష్టం. తనకు బోర్ కొట్టినప్పుడల్లా నాతో కథలు చెప్పించుకుంటాడు. అలా మేమిద్దం ఎప్పటికప్పుడు స్టోరీ డిస్కషన్స్ చేస్తూనే ఉంటాం."

ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్వయంగా గీతగోవిందం దర్శకుడు పరశురాం. బన్నీతో తనకు మంచి సంబంధాలున్నాయని, తనకు ఎప్పటికప్పుడు ఏదో ఒక కథ చెబుతూనే ఉంటానని అంటున్నాడు పరశురాం. కానీ ఇప్పటివరకు బన్నీ, తను చెప్పిన ఏ కథకు ఓకే చెప్పలేదని కేవలం అతడు తన కథల్ని ఎంజాయ్ చేస్తాడని అంటున్నాడు.

"బన్నీతో సినిమా చేయాలనే ఆలోచన నాక్కూడా ఉంది. ఇప్పటికే నా దగ్గర 2-3 ఐడియాలున్నాయి. కాకపోతే ప్రాజెక్టు సెట్ అవ్వాలంటే అన్నీ కుదరాలి కదా. బన్నీతో సినిమా చేస్తే అది పెద్ద ఎఛీవ్ మెంట్."

ఇలా బన్నీతో సినిమాపై అన్యోపదేశంగా చెప్పాలనుకున్నది చెప్పేశాడు పరశురాం. గీతాఆర్ట్స్ కాంపౌండ్ లో ఓ కథ సెట్ అవ్వడం, పట్టాలపైకి రావడం చాలా కష్టమనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. 

నిజానికి గీతగోవిందం కథను మొదట బన్నీకే వినిపించాడట పరశురాం. ఆ స్టోరీ అల్లుఅర్జున్ కు బాగా నచ్చిందట. ఇదే విషయాన్ని బన్నీ కూడా ఓసారి చెప్పుకొచ్చాడు.  కానీ అన్ని కథల్లానే గీతగోవిందం కథ కూడా విని ఎంజాయ్ చేశాడు తప్ప, అందులో నటిస్తానని బన్నీ ఎప్పుడూ చెప్పలేదంటున్నాడు పరశురాం. 

కేవలం పరశురాంకు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో చాలామంది దర్శకులకు బన్నీతో ఇలాంటి అనుభవాలున్నాయి. కథ చెప్పిన తర్వాత ఓకే చెప్పడానికి బన్నీ చాలా టైం తీసుకుంటాడని, స్టోరీలైన్ కు ఓకే చెప్పిన తర్వాత ఫుల్ స్క్రీన్ ప్లే రాసుకొస్తే, ఆ దశలో కూడా అప్పుడప్పుడు నో చెబుతాడనే రూమర్ ఉంది.