Advertisement

Advertisement


Home > Movies - Movie News

విడాకుల‌తో ధ‌నుష్ సినిమా మార్కెట్ కు దెబ్బ‌?

విడాకుల‌తో ధ‌నుష్ సినిమా మార్కెట్ కు దెబ్బ‌?

తాము అధికారికంగా విడిపోబోతున్న‌ట్టుగా ధ‌నుష్, ఐశ్వ‌ర్య‌లు ప్ర‌క‌టించేసిన నేప‌థ్యంలో.. ఒక‌వైపు సినిమా వాళ్ల వైవాహిక బంధాల పటిష్ట‌త‌పై చ‌ర్చ జ‌రుగుతూ ఉండ‌గా, మ‌రోవైపు ఈ విడాకుల‌తో ధ‌నుష్ సినిమా మార్కెట్ కూడా దెబ్బ‌తింటుందా? అనే  చ‌ర్చ కూడా మొద‌ల‌వుతోంది.

సూటిగా చెప్పాలంటే ధ‌నుష్ ఇన్నాళ్లూ ర‌జ‌నీకాంత్ అల్లుడు కాబ‌ట్టి.. అత‌డి సినిమాకు హార‌తులు ప‌ట్టిన సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఇక‌పై అదే స్థాయి ఆద‌ర‌ణ చూపుతారా? అనేది ప్ర‌శ్నార్థ‌కం. త‌మిళ‌నాట ర‌జ‌నీ ఫ్యాన్స్ స‌పోర్ట్ కూడా ధ‌నుష్ కు గ‌ట్టిగానే ఉండింది ఇన్నాళ్లూ. ర‌జ‌నీకి అల్లుడు కావ‌డంతో వ‌చ్చిన ఆద‌ర‌ణ అది. ఇప్పుడు విడాకులు తీసేసుకుంటున్నాడు కాబ‌ట్టి.. ర‌జ‌నీ ఫ్యాన్స్ ఆ స్థాయి ఆద‌ర‌ణ చూపక‌పోతే అది ధ‌నుష్ సినిమా మార్కెట్ పై ప్ర‌భావంగా మారుతుంది.

అయితే.. ధ‌నుష్ గ‌త ద‌శాబ్దంన్న‌ర‌లో సోలో స్టార్ డ‌మ్ నూ సంపాదించుకున్నాడు. ర‌జ‌నీకాంత్ అల్లుడు కాక‌ముందే... ధ‌నుష్ ఖాతాలో త‌మిళ హిట్ లు  ఉన్నాయి. అప్ప‌టికే అత‌డి సినిమాలు కొన్ని తెలుగులోకి కూడా అనువాదం అయ్యాయి. ర‌జ‌నీకాంత్ అల్లుడు కాక‌పోయి ఉన్నా.. త‌మిళ‌నాట ధ‌నుష్ చెప్పుకోద‌గిన న‌టుడు, హీరో. అత‌డి మార్కెట్ లో కొంత స్థిరంగా ఉంటుంది.

అలాగే ధ‌నుష్ ఇప్ప‌టికే హిందీ లో ప‌లు సినిమాలు చేశాడు. తెలుగులో కూడా స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. ఇదంతా ధ‌నుష్ త‌ను చేసిన సినిమాల‌తో సంపాదించుకున్న క్రేజు, మార్కెట్ కు ప్ర‌తిరూపం. ర‌జ‌నీకాంత్ అల్లుడు అని ధ‌నుష్ కు తెలుగునాట ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. అలాగే హిందీలో కూడా. అత‌డు ఇన్నాళ్లూ చేసిన సినిమాల నేప‌థ్యం ఇప్పుడు క‌లిసి వ‌స్తోంది.

కానీ, ఇక్కోడో పాయింట్ ఉంది. ధ‌నుష్ ఇన్నాళ్లూ చేసిన ప్ర‌యోగాల‌కూ, హీరోగా, నిర్మాత‌గా చేసిన సినిమాల‌కూ ఎంతో కొంత ర‌జ‌నీ ఇమేజ్ కూడా క‌లిసి వ‌చ్చి ఉంటుంది. ర‌జ‌నీ అల్లుడిగా ల‌భించిన బ్యాక‌ప్ తో అత‌డు ప్ర‌యోగాలు కూడా చేయ‌గ‌లిగి ఉండ‌వ‌చ్చు. అంతే కాదు.. త‌న సినిమాల్లో ర‌జనీ అభిమానిగా క‌నిపించ‌డానికి ధ‌నుష్ ప్ర‌య‌త్నించేవాడు. క‌ర్ణ‌న్ సినిమాలో ధ‌నుష్ టీష‌ర్ట్ ల మీద ర‌జ‌నీకాంత్ బొమ్మ ఉంటుంది. ర‌జ‌నీకాంత్ ఫ్యాన్ గా క‌నిపిస్తూ.. అలా ర‌జ‌నీ ఫ్యాన్స్ ను ధ‌నుష్ మ‌రింత ద‌గ్గ‌ర చేసుకునే ప్ర‌య‌త్నాలే అవి అనుకోవాలి!

ర‌జ‌నీకాంత్ ఇమేజ్ ధ‌నుష్ కు ఎంతో కొంత పునాదిగా ఉప‌యోగ‌ప‌డింది. ఆ పునాదిపై ధ‌నుష్ పెద్ద భ‌వంతిని నిర్మింప‌జేసుకున్నాడు. ఇక‌పై ఆ పునాది కొంత దెబ్బ తిన‌వ‌చ్చు. దీని ఫ‌లితంగా భ‌వంతి చెక్కుచెదుతుందా లేదా అనేది ధ‌నుష్ త‌దుపరి కెరీర్ ను బ‌ట్టి అర్థం కావొచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?