cloudfront

Advertisement


Home > Movies - Movie News

అప్పుడు కాన్సెప్ట్ పోస్టర్.. ఇప్పుడు కాన్సెప్ట్ సాంగ్

అప్పుడు కాన్సెప్ట్ పోస్టర్.. ఇప్పుడు కాన్సెప్ట్ సాంగ్

అజ్ఞాతవాసి టైమ్ లో కాన్సెప్ట్ పోస్టర్ అంటూ ప్రచారం ప్రారంభించాడు త్రివిక్రమ్. ఆ మూవీ ప్రమోషన్ ఆ పోస్టర్ నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాకు కూడా ఇలాంటిదే ఓ సరికొత్త ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చే నెల 20న, తారక్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నాడట త్రివిక్రమ్. ఓ విధంగా చెప్పాలంటే దీన్ని సినిమా థీమ్ సాంగ్ అని కూడా అనుకోవచ్చు.

ఈ ప్రాజెక్టుకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్-తమన్ కాంబోలో ఇదే ఫస్ట్ మూవీ. ఇప్పటికే దర్శకుడు, సంగీత దర్శకుడి మధ్య మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం కాగా.. తాజాగా మరోసారి ముంబయిలోని ఓ ప్రైవేటు స్టుడియోలో సంగీత చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ పుట్టినరోజు నాటికి కాన్సెప్ట్ సాంగ్ ను రెడీ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

అజ్ఞాతవాసి డిజాస్టర్ తో పూర్తిగా ముఖం చాటేశాడు త్రివిక్రమ్. ఆ సినిమా ఫ్లాప్ అయిన వెంటనే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాపై రీ-వర్క్ ప్రారంభించాడు. మరోసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి కూర్చొని స్క్రీన్ ప్లే మొత్తం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నారు. అలా ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకొని పట్టాలపైకి వచ్చింది ఈ ప్రాజెక్టు. అలాంటి సినిమాకు మొట్టమొదటి ప్రమోషనల్ ఎలిమెంట్ గా వస్తోంది ఈ కాన్సెప్ట్ సాంగ్.

ఇది క్లిక్ అయితే తారక్-త్రివిక్రమ్ సినిమాపై బజ్ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ నడుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె ఇంకా సెట్స్ పైకి రాలేదు.