గత ఏడాది డర్టీ హరి అంటూ మాంచి రసవత్తరమైన స్టిల్స్ కంటెంట్ వదిలి సినిమాను ప్రమోట్ చేసి ఆక్టుకున్నారు నిర్మాత కమ్ డైరక్టర్ ఎమ్ ఎస్ రాజు. ఆ ఊపులో మళ్లీ అలాంటి టైటిల్ తోనే సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ అంటూ సినిమా స్టార్ట్ చేసారు.
కానీ చిత్రంగా ఈ సినిమా మాత్రం కూల్ ఎంటర్ టైనర్ అంటున్నారు. ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ చూస్తుంటే సుమంత్ అశ్విన్ హీరో అని అర్థమవుతోంది. ఆయన పక్కన క్యూట్‌గా ఉన్న హీరోయిన్ మెహర్ చావల్ .అయితే సినిమాలో మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని, అలాగే మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ, రిషికా బాలిని కూడా ఇదే సినిమాలో పరిచయం చేస్తున్నారు.
పోస్టర్ విడుదల సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “చాలా యూత్‌ఫుల్ కంటెంట్‌తో కూల్ ఎంటర్ టైనర్ గా సినిమా నిర్మిస్తున్నాం. పాటలకు, నేపథ్య సంగీతానికి మంచి స్కోప్ ఉంది. అని అన్నారు.
దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ “సాధారణంగా 'డర్టీ హరి' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మళ్లీ అదే తరహా సినిమా చేస్తారని అందరూ ఊహిస్తారు. కానీ, '7 డేస్ 6 నైట్స్' అందుకు భిన్నంగా వేరే రీతిలో ఉండే చిత్రమిది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంటిల్లిపాదినీ వినోదపరిచే విధంగా చక్కటి జాలీ ట్రిప్‌లా ఉంటుంది. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, విజువల్స్, మ్యూజిక్ ఈ చిత్రాన్ని డామినేట్ చేస్తాయి.” అని అన్నారు.