Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ రేసులోకి ఈటీవీ

మళ్లీ రేసులోకి ఈటీవీ

ఓ కొత్త సినిమా వేయాలంటే మాటీవీ, జెమినీ, జీ తెలుగు. శాటిలైట్ రైట్స్ దక్కించుకునే విషయంలో ఈ 3 ఛానెళ్ల మధ్య మాత్రమే పోటీ ఉండేది. మేకర్స్ కూడా ఎక్కువగా ఈ 3 ఛానెళ్లనే ఆశ్రయించేవారు. ఈ విషయంలో ఈటీవీ ఎప్పుడూ వెనకే. తన దగ్గరున్న వెయ్యికి పైగా సినిమాలనే అది అటుఇటు తిప్పి నడిపిస్తూ వచ్చింది.

మెయిన్ ఛానెల్ లో, సినిమాలు ఛానెల్ లో పాత సినిమాలే కనిపించేవి. కానీ ఇప్పుడు ఈటీవీ కూడా రేసులోకి వచ్చినట్టు కనిపిస్తోంది. మరీ భారీగా కాకపోయినా, ఉన్నంతలో కొత్త సినిమాల్ని కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది.

తమకు అందుబాటు రేటులో ఉండే సినిమాల్ని కొనడం ప్రారంభించింది ఈటీవీ. అక్కడ్నుంచి మెల్లగా బడ్జెట్ ను పెంచుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఏకంగా వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అవును.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైంధవ్ సినిమా ఈటీవీ ఖాతాలోకి చేరేలా ఉంది.

రీసెంట్ గా వచ్చి హిట్టయిన మ్యాడ్ అనే సినిమా కూడా ఈటీవీ చెంతకే చేరింది. ఇక 'అందరూ బాగుండాలి అందులో నేనుండాలి' అనే మరో చిన్న సినిమాను కూడా ఈటీవీ దక్కించుకొని, తాజాగా టెలికాస్ట్ కూడా చేసింది.

ఇన్నాళ్లూ సీరియళ్లు, నాన్-ఫిక్షన్ కార్యక్రమాలతో బండి లాగిస్తూ వచ్చింది ఈటీవీ. ఇప్పుడు సినిమాల కొనుగోలుతో జీఈసీ సెగ్మెంట్ లో సరికొత్త పోటీకి తెరదీసింది. అటు నిర్మాతలకు కూడా ఈటీవీ రూపంలో మరో ఆప్షన్ దొరికినట్టయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?