గత కొంత కాలంగా సాగుతున్న ప్రచారం ఒకటి వుంది. సీనియర్ హీరో అర్జున్ లేటెస్ట్ గా ఒక తెలుగు సినిమాలో నటించబోతున్నారన్నది ఆ వార్త.
సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో ప్రతినాయకుడిగా అర్జున్ నటించబోతున్నారని తెగ ప్రచారంలోకి వచ్చింది. కానీ అది ముమ్మాటికే ఫేక్ న్యూస్ అని తెలుస్తోంది.
మహేష్ బాబును సర్కారువారి పాటలో ఢీకొనబోయేది అర్జున్ కాదు. సముద్రఖని. అలవైకుంఠపురములో సినిమాతో తెలుగు నాట విలన్ గా మాంచి క్రేజ్ తెచ్చుకున్నారు సమద్ర ఖని. అందుకే ఆయననే సర్కారు వారి పాటలో కీలక ప్రతినాయకుని పాత్రకు తీసుకున్నట్లు తెలుస్తోంది.
పరుశురామ్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాకు నిర్మాతలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు. కీర్తి సురేష్ కథానాయక. బ్యాంకు రుణాల ఎగవేత నేపథ్యంలో తయారుచేసిన కథాంశంతో ఈ సినిమా తయారవుతోంది.