cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్ -విశ్వప్రసాద్..పిబిసి

ఎక్స్ క్లూజివ్ -విశ్వప్రసాద్..పిబిసి

నిర్మాత టిజి విశ్వప్రసాద్ మీడియా రంగంలోకి దిగుతున్నారు. ఇందుకోసం పీపుల్స్ మీడియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ సంస్థ ను ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ ఛానెల్ ను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. 

అంతకన్నా ముందుగా రెండు పైలట్ ప్రాజెక్టులను ప్లాన్ చేసారు. 99 టీవీ, మహా టీవీల్లో కొన్ని గంటల స్లాట్ లను తీసుకుంటున్నారు. వీటిలో ఆయన ఛానెల్ పేరిట స్టోరీలు ప్రసారమవుతాయి. మహాటీవీలో ప్రసారం అయ్యే కార్యక్రమాలను జర్నలిస్ట్ స్వప్న పర్యవేక్షిస్తారు.

జనసేన నాయకులు పవన్, నాదెండ్ల మనోహర్ తో విశ్వప్రసాద్ కు సన్నిహిత సంబంధాలు వున్నాయి. అలాగే రాయలసీమలోని వైకాపా ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలు వున్నాయి. రాయలసీమ టైగర్ అనిపించుకున్న టిజి వెంకటేష్ కు సన్నిహిత బంధువే విశ్వప్రసాద్. ఇప్పటి వరకు పీపుల్స్ మీడియా బ్యానర్ మీద సాఫ్ట్ వేర్ వ్యాపారాలు, సినిమా నిర్మాణాలు చేపట్టిన ఆయన ఇప్పుడు మీడియాలోకి కాలు పెడుతున్నారు. 

అయితే ఈ కార్యక్రమాలు అన్నీ జనసేన, భాజపా అనుకూలంగా వుండే అవకాశం వుంది. కానీ అలా అని వైకాపాకు వ్యతిరేకంగా వుంటాయని లేదు. ఎందుకంటే అటు స్వప్నకు ఇటు విశ్వప్రసాద్ కు కూడా వైకాపాతో మంచి సంబంధాలు వున్నాయి. 

అయితే నేరుగా డిజిటల్ టీవీ స్టార్ట్ చేయకుండా 99 టీవీ, మహా టీవీలో కొన్ని గంటల ప్రసారాలు చేయడం ద్వారా బ్రాండింగ్ ను జనాలకు పరిచయం చేయగలము అనే ఆలోచన ఎంత వరకు ప్రాక్టికల్ అన్నది విశ్వప్రసాద్ ఆలోచించినట్లు లేదు. 

లీడింగ్ చానెళ్లు సైతం యూ ట్యూబ్ మీద ఆధారపడి కంటెంట్ ను అందిస్తుంటే, లీడింగ్ చానెళ్లు కాని వాటికి పెట్టుబడి పెట్టి బ్రాండింగ్ తెచ్చుకుందాం అనే ఆలోచన సరైనది కాదు అని అనుభవంలో తెలిసిరావచ్చు.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×