cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఎక్స్ క్లూజివ్... హీరోగా వివి వినాయక్

ఎక్స్ క్లూజివ్... హీరోగా వివి వినాయక్

దర్శకుడు వివి వినాయక్ హీరోగా మారుతున్నారు. అవును.. నిజమే. ఆయన వయసు, ఫిజిక్ కు తగిన ఓ పాత్రతో మాంచి స్క్రిప్ట్ ఒకటి రావడంతో ఆయన ఓకె అన్నారు. అయితే ఈ ఆలోచన, వ్యవహారం వివి వినాయక్ ది కాదు. కథలు, స్క్రిప్ట్ లను గట్టిగా నమ్మి, దూసుకునిపోయే నిర్మాత దిల్ రాజుది.

డైరక్టర్ శంకర్ అసిస్టెంట్ నరసింహారావు అనే కొత్త దర్శకుడు చెప్పిన స్క్రిప్ట్ నిర్మాత దిల్ రాజుకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన సోమవారం సాయంత్రం దర్శకుడు వివి వినాయక్ ను నెరేషన్ ఇప్పించడం, ఆయన వెంటనే ఒకె అనడం జరిగిపోయింది. 

బహుశా ఈరోజు అనౌన్స్ మెంట్ వుండొచ్చు. ప్రస్తుతం తిరుపతిలో వున్నారు నిర్మాత దిల్ రాజు అండ్ మహర్షి టీమ్. అక్కడే ఈ సినిమా ప్రకటన వుంటుందని తెలుస్తోంది. 2003లో దిల్ సినిమాతో నిర్మాతగా మారారు వి వెంకట రమణారెడ్డి అలియాస్ రాజు.

ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకుని దిల్ రాజు అయిపోయారు. ఆ సినిమాకు దర్శకుడు వివి వినాయక్ నే. ఆనాటి తొలి సినిమా అనుబంధం ఇప్పుడు ఈ కొత్త తరహా చిత్రానికి నాంది పలుకుతోంది.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!