Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్ర‌భాస్ జూబ్లీహిల్స్ ఇంటి విలువ భారీగానే!

ప్ర‌భాస్ జూబ్లీహిల్స్ ఇంటి విలువ భారీగానే!

విలాస‌వంత‌మైన జీవితాల‌ను అనుభ‌వించ‌డంలో సినిమా స్టార్ల‌కు, క్రికెట‌ర్ల‌కు ధీటైన వాళ్లు లేరు ఇండియాలో. రాజ‌కీయ నేత‌లు, వ్యాపార‌వేత్త‌లు కూడా వీరి లెవ‌ల్ కు పై స్థాయి వారే కానీ, సినిమా వాళ్ల ల‌గ్జ‌రీ మాత్రం చాలా గ్లామ‌ర్ తో కూడుకున్న వ్య‌వ‌హారం. 

ప్ర‌త్యేకించి బాలీవుడ్ స్టార్ల విలాసాలు త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ద‌క్షిణాది తార‌లు కూడా అందుకు ధీటుగా నిలుస్తూ ఉన్నారు. ద‌క్షిణాది స్టార్ల సినిమాలు కూడా జాతీయ స్థాయిలో విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో.. పారితోషికాలు భారీగా పెరిగి, వీరి జీవితాలు అత్యంత ల‌గ్జ‌రీయ‌స్ గా మారుతున్నాయి.

ఈ క్ర‌మంలో న‌టుడు ప్ర‌భాస్ వైభ‌వం గురించి జాతీయ మీడియా కూడా క‌థ‌నాల‌ను ఇస్తూ ఉంది. ఆ స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌భాస్ వ‌ద్ద ఉన్న మోస్ట్ వ్యాల్యూబుల్ ప్రాప‌ర్టీస్ జాబితా ఇలా ఉంది. వీటిల్లో ముఖ్య‌మైన‌ది ప్ర‌భాస్ కు హైద‌రాబాద్ లో ఉన్న బంగ్లా. జూబ్లీ హిల్స్ ఏరియాలోని ప్ర‌భాస్ ఇంటి విలువ సుమారు అర‌వై కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ట‌! ఇందులో ప్ర‌భాస్ కోసం రూపొందించుకున్న ప్రీమియ‌ర్ జిమ్ ఏర్పాటుకే కోటిన్న‌ర రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చు పెట్టార‌ట‌.

ఇక ఇల్లు త‌ర్వాత ప్ర‌భాస్ ఇంటి ఆవ‌ర‌ణ‌లో.. ఉన్న కార్లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణీయ‌మైన‌విగా నిలుస్తున్నాయి. సుమారు అర‌డ‌జ‌నుకు పైగా ల‌గ్జ‌రీ కార్లు ప్ర‌భాస్ సొంతం. వాటిల్లో బీఎండ‌బ్ల్యూ, లాంబోర్గిని, జాగ్వార్, ల్యాండ్ రోవ‌ర్, రోల్స్ రాయిస్ త‌ర‌హా ప్రీమియం బ్రాండ్ కార్లున్నాయి.

వీటిల్లో అత్యంత విలువైన‌ది రోల్స్ రాయిస్ ఫాంట‌మ్ దీని విలువ సుమారు ఎనిమిది కోట్ల రూపాయ‌లు అని అంచ‌నా. ఇందులో రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల మేర క‌స్ట‌మైజేష‌న్ కోస‌మే వెచ్చించాడ‌ట ఈ స్టార్ హీరో.  

ఇక క‌స్ట‌మైజేష‌న్ త‌ర్వాత మూడు కోట్ల రూపాయ‌ల విలువ జేసే ఇంకో ల్యాండ్ రోవ‌ర్ ను కూడా ప్ర‌భాస్ క‌లిగి ఉన్నాడు. ప్ర‌స్తుతం సినిమాకు ఎన‌భై నుంచి 120 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని చార్జ్ చేయ‌గ‌ల స‌త్తాను క‌లిగిన ప్ర‌భాస్ కు ఇలాంటి వాటిని క‌లిగి ఉండ‌టం చాలా తేలికైన అంశ‌మే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?