cloudfront

Advertisement


Home > Movies - Movie News

పండక్కి కొత్త అల్లుళ్లు రెడీ అయ్యారు

పండక్కి కొత్త అల్లుళ్లు రెడీ అయ్యారు

సంక్రాంతికి ఇంకా చాలా టైం ఉంది. కానీ అల్లుళ్లు మాత్రం అప్పుడే రెడీ అయిపోయారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్-2 సినిమా మేటర్ ఇది. 'వస్తున్నారు సంక్రాంతి అల్లుళ్లు' అనే క్యాప్షన్ తో ఎఫ్-2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఈరోజు. నిజంగా లుక్ చూస్తే సంక్రాంతి ఫ్లేవర్ మొత్తం ఇందులో కనిపిస్తోంది. ట్రెడిషనల్ దుస్తుల్లో వెంకటేష్, వరుణ్ తేజ్.. అదే విధంగా తమన్న, మెహ్రీన్ భలే కలర్ ఫుల్ గా ఉన్నారు.

సంక్రాంతికి మొట్టమొదటగా రెడీ అవుతున్న సినిమా ఇదే. మూవీకి సంబంధించి దాదాపు 80శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. కేవలం క్లయిమాక్స్, 3 పాటలు మాత్రమే బాకీ ఉన్నట్టు తెలిపారు. డిసెంబర్ మొదటి వారానికి అది కూడా పూర్తిచేసి, అందరికంటే ముందే రెడీ అయిపోతున్నారు వెంకీ, వరుణ్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి 2 వారాల పాటు బ్యాంకాంక్ లో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ షెడ్యూల్ తోనే సినిమా మొత్తం ఓ కొలిక్కి వచ్చింది. అనీల్ రావిపూడి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సంక్రాంతికి పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించేది తమ సినిమానే అంటున్నాడు దిల్ రాజు. చూద్దాం.. కనీసం ఈ సినిమానైనా దిల్ రాజు జాతకాన్ని మారుస్తుందేమో.

నోరున్న అనితకు టికెట్ హుళక్కేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్