
ఉప్పెన వస్తోంది. సుకుమార్ సూపర్ విజన్ లో మైత్రీ మూవీస్ నిర్మించిన ప్రేమ 'ఉప్పెన' ఇది. బుచ్చిబాబు దర్శకుడు. అంతే కాదు, యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలిసారి చేస్తున్న సినిమా. క్రితి శెట్టి అనే అందమైన హీరోయిన్ ను తెలుగుకు పరిచయం చేస్తున్న సినిమా.
ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయిపోయాయి. దేవీశ్రీప్రసాద్ సూపర్ అడియో ఇచ్చారు. అన్నీ బాగానే వున్నాయి. కానీ కరోనా కారణంగా జస్ట్ వారం రోజుల్లో విడుదల వుండగా థియేటర్లు మూతపడిపోయాయి.
అప్పటి నుంచి తొమ్మిదినెలలుగా లాబ్ లోనే వుండిపోయింది సినిమా,. ఇప్పుడు బయటకు వస్తోంది. ఫిబ్రవరి 5న విడుదల చేయాలని టెంటటివ్ గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అన్నది మంచి టైమ్, భీష్మ, ఛలో, మిర్చి లాంటి అనేక సినిమాలు వచ్చిన టైమ్ అది. అందుకే ఆ టైమ్ ను ఎంచుకున్నారు.
టీజర్ ను రేపు విడుదల చేస్తున్నారు. కేవలం హీరో హీరోయిన్లు ఇద్దరి మీదా టీజర్ కట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో 'నీ నవ్వు నీలి సముద్రం' బీజీఎమ్ జోడించినట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి కీలక పాత్రే అయినా టీజర్ లో కనిపించడు
దేవుడిపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలాడుతున్నారు