Advertisement


Home > Movies - Movie News
ఇలియానాకి ఇన్నాళ్లకు బుద్దొచ్చిందా..!

తెలుగులో అవకాశాలున్నా బాలీవుడ్ మోజులో ముంబై వెళ్లిపోయిన ఏ హీరోయిన్ కూడా అక్కడ బతికి బట్టగట్టిన దాఖలాలు లేవు. ఒకటీ అరా అవకాశాలొచ్చినా ముంబై హీరోయిన్ల ధాటికి తట్టుకుని నిలబడగలిగే సీన్ ఏ హీరోయిన్ కీ లేదు. ఇలియానా కూడా ఇందుకు మినహాయింపు కాదు.

తమన్నా, కాజల్, శృతి హాసన్ కూడా బాలీవుడ్ ని టచ్ చేసినా తెలుగు ఇండస్ట్రీని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఇలియానా మాత్రం తెలుగు సినిమాలు ఇక చేయను అంటూ తెగేసి చెప్పి బాలీవుడ్ కి వెళ్లిపోయింది. కోటి తారగా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఇలియానా 2012లో దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత మళ్లీ కనిపించ లేదు.

మళ్లీ ఇన్నేళ్లకు ఇలియానాకు బుద్ధొచ్చింది. బాలీవుడ్ లో ఒకటీ అరా అవకాశాలు వచ్చినా సక్సెస్ కాకపోవడం, ముంబై హీరోయిన్లకు ఇచ్చినంత ప్రాధాన్యత సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఇలియానాకు ఇవ్వకపోవడంతో తిరిగి మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది గోవా బ్యూటీ.

రవితేజతో చివరి సినిమా చేసి, మళ్లీ రవితేజ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది.

అయితే రీఎంట్రీతో ఇలియానా తెలుగులో సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. దాదాపుగా ఇలియానా బ్యాచ్ అంతా ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకునే పనిలో ఉంది. చాలామంది ఫేడవుట్ అయిపోయారు కూడా. ఇలాంటి టైమ్ లో ఇలియానా ఒంపులు టాలీవుడ్ ను ఏ మేరకు ఎట్రాక్ట్ చేస్తాయో చూడాలి.