Advertisement


Home > Movies - Movie News
మొదటిసారి ఓ హీరోతో కలిసి వర్క్ చేయబోతున్నాడు

ఇప్పటివరకు 2 సినిమాలు చేశాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. కానీ అందులో హీరోలు లేరు. రెండు సినిమాల్లో కొత్త నటీనటులు నటించారు. ఇప్పుడు తన మూడో ప్రయత్నంగా, తొలిసారి ఓ హీరోతో కలిసి పనిచేయబోతున్నాడు ఈ దర్శకుడు. అతడే రానా. అవును.. హీరో రానా కోసం కథ సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయాడు తరుణ్.

రీసెంట్ గా ఈ దర్శకుడు తీసిన సినిమా 'ఈ నగరానికి ఏమైంది'. ఇందులో దాదాపు అంతా కొత్తవాళ్లు నటించారు. హీరో అనే కాన్సెప్ట్ లేని సినిమా ఇది. అంతకుముందు తరుణ్ తీసిన పెళ్లి చూపులు సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. అప్పటికి అతడెవరో చాలామందికి తెలీదు. ఇప్పుడు తన మూడో సినిమాలో మాత్రం కాస్త హీరోయిజం చూపించడానికి ట్రై చేస్తున్నాడు తరుణ్ భాస్కర్.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏకంగా 3 సినిమాలకు కమిట్ అయ్యాడు తరుణ్. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ సినిమా వచ్చింది. ఇప్పుడు రెండోది రానా హీరోగా రాబోతోంది. మొన్నటివరకు ఈ నగరానికి ఏమైంది సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న తరుణ్ భాస్కర్, ఇప్పుడు పూర్తిగా రానాతో చేయబోయే సినిమా మీద దృష్టిపెట్టాడు.

కాకపోతే ఇప్పట్లో ఈ సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ లేదు. సరైన కథ కోసం కనీసం 6 నెలలు గ్యాప్ తీసుకుంటాడు ఈ దర్శకుడు. సో.. రానా-తరుణ్ భాస్కర్ కాంబో సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా టైం ఉంది.