cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఫ్లాపులతో బెదిరిపోయిన హీరో

ఫ్లాపులతో బెదిరిపోయిన హీరో

రిజల్టుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోయే మాస్‌ మహారాజా రవితేజకి లాస్ట్‌ ఇయర్‌ గట్టి షాకులే తగిలాయి. వరుసగా మూడు భారీ డిజాస్టర్లు రావడంతో రవితేజ మార్కెట్‌పై పెద్ద దెబ్బ పడింది. అమర్‌ అక్బర్‌ ఆంటొని డిజాస్టర్‌ అయిన తర్వాత రవితేజకి కూడా తెలిసి వచ్చింది. మునుపటిలా పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తిగా లేకపోవడం, తనతో అనుకున్న ప్రాజెక్టులు వేరే వారితో డిస్కషన్లకి వెళ్లడంతో రవితేజ అలర్ట్‌ అయ్యాడు.

అసలయితే అతని కొత్త సినిమా గత నెలలోనే మొదలు కావాల్సి వుంది. విఐ ఆనంద్‌ దర్శకత్వంలో డిస్కో రాజా అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేయడానికి అంగీకరించిన రవితేజ ఆ కథపై మరోసారి వర్క్‌ చేయమని చెప్పాడట. మొదట్లో కొన్ని డౌట్స్‌ వున్నా కానీ ఛల్తా అనుకున్నవాడే ఇప్పుడు పర్‌ఫెక్ట్‌ బౌండ్‌ స్క్రిప్ట్‌ కావాలంటున్నాడట.

దీంతో మరోసారి ఆ చిత్ర కథపై ఆనంద్‌, రైటర్‌ అబ్బూరి రవి కలిసి కసరత్తు మొదలు పెట్టారు. సినిమా మొదలు పెట్టడానికి సమయం తీసుకున్నా ఫరవాలేదు కానీ పర్‌ఫెక్ట్‌గా రాని స్క్రిప్ట్‌తో రిస్క్‌లు వేస్ట్‌ అని డిసైడ్‌ అయ్యాడట. ఇకపై తన సినిమాలు రెగ్యులర్‌ ధోరణిలో కాకుండా డిఫరెంట్‌గా వుండేట్టు కథాపరంగా కొత్త పంథా అనుసరిస్తున్నాడట.  

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?