cloudfront

Advertisement


Home > Movies - Movie News

రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఒకటేనా?

రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఒకటేనా?

హీరో విజయ్ దేవరకొండకు అరుదైన గౌరవం, గుర్తింపు లభించింది. తన కెరీర్ లోనే తొలిసారిగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కాడు ఈ హీరో. 2018 సంవత్సరానికి గాను టాప్-100 సెలబ్రిటీ లిస్ట్ లో విజయ్ దేవరకొండ పేరు కూడా ప్రత్యక్షమైంది. ఈ ఏడాది 14 కోట్ల రూపాయలతో 72వ ర్యాంక్ తో కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ.

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చాడు ఈ హీరో. ఆ తర్వాత గీతగోవిందం సినిమాతో స్టార్ అయిపోయాడు. రీసెంట్ గా వచ్చిన టాక్సీవాలా సినిమా కూడా హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ మార్కెట్ వాల్యూతో పాటు రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. అతడి క్రేజ్, మార్కెట్ వాల్యూ, పారితోషికం, డిమాండ్ ను లెక్కలోకి తీసుకొని "ఇండియా సెలబ్రిటీ 100 లిస్ట్" లో 72వ ర్యాంక్ ఇచ్చింది ఫోర్బ్స్.

వచ్చే ఏడాది ఈ లిస్ట్ లో విజయ్ దేవరకొండ మరింత మెరుగైన ర్యాంక్ దక్కించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గీతగోవిందం, టాక్సీవాలా విజయాల తర్వాత ఇతడి రేంజ్ పెరిగింది. మార్కెట్ కూడా డబుల్ అయింది. దానికి తగ్గట్టే విజయ్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. సో.. వచ్చే ఏడాది ఇతడి ర్యాంక్ మరింత పెరగడం ఖాయం.

ఈసారి లిస్ట్ లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండతో పాటు హీరో రామ్ చరణ్ అదే ర్యాంక్ తో, అంతే సంపాదనతో కొనసాగుతున్నాడు. అవును.. చరణ్  ఆదాయాన్ని 14 కోట్లుగా చూపించిన ఫోర్బ్స్ అతడికి కూడా 72 ర్యాంక్ నే కట్టబెట్టింది.

రంగస్థలం సినిమాతో చెర్రీ మార్కెట్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం బోయపాటితో చేస్తున్న సినిమాకు తన కెరీర్ లోనే హయ్యస్ట్ ఎమౌంట్ ను పారితోషికంగా అందుకున్నాడు చరణ్. అయినప్పటికీ ఫోర్బ్స్ లో అతడు, విజయ్ దేవరకొండతో కలిసి ఒకే ర్యాంక్ పంచుకోవాల్సి వచ్చింది.

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్