Advertisement


Home > Movies - Movie News
గాంధీతో పోల్చేసుకున్న కమల్‌హాసన్‌

జాతి పిత.. మహాత్మా గాంధీతో తనను తాను పోల్చేసుకున్నాడు విశ్వ నటుడు కమల్‌హాసన్‌. ప్రజాస్వామ్యం కదా, ఎవరైనా ఎలాగైనా మాట్లాడెయ్యొచ్చు. మహాత్ముడు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాడు. మరి, కమల్‌హాసన్‌ ఎందుకోసం పోరాడుతున్నాడట.? తన సినిమా రిలీజ్‌కి ప్రభుత్వం అడ్డంకులు కలిగిస్తోందని, తమిళనాడు విడిచిపోతాననీ, అవసరమైతే దేశం విడిచిపోతానని ప్రకటించిన ఘనుడు కమల్‌హాసన్‌.! 

ఈ మధ్యకాలంలో రాజకీయ తెరపై కమల్‌హాసన్‌ వాయిస్‌ గట్టిగా విన్పిస్తోంది. రాజకీయ పార్టీ పెట్టే దిశగా ఓ వైపు కమల్‌హాసన్‌ పావులు కదుపుతూనే, ఇంకోపక్క రాజకీయ పార్టీ పెడితే భవిష్యత్‌ ఏమవుతుందోనన్న ఆందోళనతో మల్లగుల్లాలు పడ్తుండడం చూస్తున్నాం. రాజకీయాల్లో ఎవర్నయినా ప్రశ్నిస్తానంటాడు.. అదే సమయంలో కొందరికి మద్దతుగా, ఇంకొందరికి వ్యరతిరేకంగా మాట్లాడుతుంటాడు కమల్‌హాసన్‌. 

అవినీతి వ్యతిరేక పోరాటంలో తనవంతు పాత్ర పోషిస్తానని కమల్‌హాసన్‌ తాజాగా ప్రకటించాడు. 70 ఏళ్ళ వయసులో దేశం కోసం మహాత్మాగాంధీ పోరాటం చేశారనీ, 60 ఏళ్ళ వయసులో తానెందుకు అవినీతి వ్యతిరేక పోరాటం చేయకూడదని కమల్‌ ప్రశ్నించడం గమనార్హం. అంతేనా, తన పిల్లలు తనను 'బాపు' అని పిలుచుకుంటారంటూ మహాత్ముడితో తనను తాను ఇంకోసారి పోల్చేసుకున్న కమల్‌, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదనీ, ప్రస్తుతం వున్న ఏ రాజకీయ పార్టీలో చేరబోననీ క్లారిటీ ఇచ్చేశాడు. మరెలా పోరాటం చేస్తారు.? అంటే, పోరాటం చేయడానికి రాజకీయాల్లోకే రావాలా.? అన్నది కమల్‌ ప్రశ్న.