cloudfront

Advertisement


Home > Movies - Movie News

సూపర్ హిట్ సినిమాను డెడ్ చీప్ గా కొట్టేశారు

సూపర్ హిట్ సినిమాను డెడ్ చీప్ గా కొట్టేశారు

సినిమాల్లోనే కాదు, శాటిలైట్ రైట్స్ లో కూడా జాక్ పాట్స్ ఉంటాయి. ఊహించని సినిమాలు సూపర్ హిట్ అయితే బయ్యర్లకు పండగే. అదే విధంగా తక్కువ రేటుకు కొన్న సినిమాలు బ్లాక్ బస్టర్ అయితే, ఆ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న టీవీ ఛానెల్ కు కూడా పండగే. ప్రస్తుతం జీ తెలుగు ఛానెల్ లో అలాంటి ఫెస్టివలే నడుస్తోంది. గీతగోవిందం సినిమా తెచ్చిన ఆనందం ఇది. 

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ సినిమాను అతి తక్కువ మొత్తానికి దక్కించుకుందట జీ తెలుగు. నిర్మాతలు చెబుతున్న లెక్కల ప్రకారం.. ఈ సినిమాను జస్ట్ కోటిన్నరకే సదరు ఛానెల్ కు అమ్ముకున్నారట. సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు. మహానటి టైపులో రిలీజ్ తర్వాత శాటిలైట్ అమ్ముకుంటే బాగుండేదని బాధపడుతున్నారు.

అయితే ఈ విషయంలో అల్లు అరవింద్ అంత అమాయకుడు కాదు. ఆయన తన తెలివితేటలు ఉపయోగించి, గీతగోవిందంతో పాటు అస్సలు  బజ్ లేని టాక్సీవాలా సినిమాను కూడా అమ్మేశాడట. సో.. భవిష్యత్తులో టాక్సీవాలా రిజల్ట్ తేడాకొట్టినా అటు జీఏ-2 పిక్చర్స్, ఇటు యూవీ క్రియేషన్స్ వాళ్లకు పోయేదేం లేదు.

ప్రస్తుతం గీతగోవిందం సినిమా సూపర్ హిట్ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. షేర్ పరంగా 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. జీఏ-2 పిక్చర్స్ బ్యానర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్.