cloudfront

Advertisement


Home > Movies - Movie News

రామ్ చరణ్ ను క్రాస్ చేసిన దేవరకొండ

రామ్ చరణ్ ను క్రాస్ చేసిన దేవరకొండ

గతవారం రంగస్థలం రేటింగ్ వచ్చింది. ఈవారం గీతగోవిందం రేటింగ్ వచ్చింది. ఈ రెండు సినిమాల్ని కంపేర్ చేస్తే రంగస్థలం కంటే గీతగోవిందం సినిమాకే ఎక్కువ టీఆర్పీ వచ్చింది. స్టార్ మాలో ప్రసారం చేసిన రంగస్థలం సినిమాకు 19.5 టీఆర్పీ వస్తే, జీ తెలుగులో ప్రసారమైన గీతగోవిందం సినిమాకు ఏకంగా 20.7 టీఆర్పీ రావడం విశేషం. ఈ విషయంలో రామ్ చరణ్ ను అధిగమించాడు విజయ్ దేవరకొండ.

ఇక్కడ రేటింగ్ లో తేడాకు ప్రధాన కారణం డిజిటల్ స్ట్రీమింగ్. రంగస్థలం సినిమాను స్టార్ మాలో ప్రసారం చేయడానికి ముందే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో పెట్టేశారు. థియేటర్లలో చూసిన ప్రేక్షకులతో పాటు అప్పటివరకు చూడని ఎంతోమంది రంగస్థలాన్ని కంప్యూటర్లు, మొబైల్స్ లో చూసేశారు.

కానీ గీతగోవిందం పరిస్థితి వేరు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా జీ తెలుగు వద్దే ఉన్నాయి. దీంతో సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేసిన తర్వాత నేరుగా టీవీలో ప్రసారం చేయడంతో రేటింగ్ కాస్త ఎక్కువొచ్చింది. రంగస్థలం, గీతగోవిందం రేటింగ్స్ విషయంలో ఇదే ప్రధానమైన తేడా.

రంగస్థలం, భరత్ అనే నేను లాంటి సినిమాల్ని డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇవ్వకుండా నేరుగా టీవీల్లో ప్రసారం చేసినట్టయితే.. రేటింగ్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యేవి. కానీ అమెజాన్ ప్రైమ్ రాకతో శాటిలైట్ మార్కెట్, రేటింగ్స్ లో కూడా ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. పైగా బార్క్ వచ్చిన తర్వాత ఈ రేటింగ్స్ పై విమర్శలు ఎక్కువైన విషయం తెలిసిందే.

ఏదైతేనేం.. గీతగోవిందం రేటింగ్ లో తనకు ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఫాలోయింగ్ ఉందని నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా ఇతడ్ని ఇష్టపడుతున్నారనే విషయం స్పష్టమైంది.

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? ...చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్