Advertisement


Home > Movies - Movie News
ఘాజీ..ఇది శాంపిల్ మాత్రమేనా?

మనకు వార్ మూవీస్ తక్కువ. పైగా తెలుగులో అయితే వార్ చూపించాల్సి వచ్చినా ఏదో కిట్టింపే తప్ప, పెద్దగా ప్రయత్నం వుండదు. అలాంటిది సముద్రంపై వీరోచిత పోరాటం నేపథ్యంలో ఘాజీ సినిమాను తయారు చేస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో కావడంతో కాస్త సీరియస్ గానే ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా ట్రయిలర్ ఇప్పుడు విడుదలయింది. 

ఘాజీ ట్రయిలర్ తెలుగు సినిమా స్థాయితో పోల్చుకుంటే బాగానేవుంది. మంచి ప్రయత్నం సిన్సియర్ గా చేస్తున్నారని స్పష్టమవుతోంది. నీటి మీద, అదీ సబ్ మెరీన్ నేపథ్యంలో సినిమా తీయడం అంటే అంత ఆషామాషీ కాదు. అందువల్ల ట్రయిలర్ ను జస్ట్ శాంపిల్ గా మాత్రమే చూడాలి. అలా చూసుకుంటే, ఆ శాంపిల్ బావుందనే చెప్పాలి.

ట్రయిలర్ లో చూపించిన సన్నివేశాల పూర్తి నిడివి చూస్తే తప్ప తనివి తీరదు. కానీ అలా తనివి తీరా సముద్రంలో సబ్ మైరైన్ తోడుగా మన వీర జవాన్ల విన్యాసాలు చూడాలంటే మరో నెలా పదిహేను రోజులు ఆగాల్సిందే.