cloudfront

Advertisement


Home > Movies - Movie News

గీతా2లో అఖిల్ సినిమా ప్రారంభం

గీతా2లో అఖిల్ సినిమా ప్రారంభం

తన కెరీర్ లో రకరకాల సినిమాలు చేస్తూ విజయాన్ని వెదుక్కుంటున్న అఖిల్ అక్కినేని ఈసారి బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. అన్న చైతన్యకు 100% లవ్ లాంటి హిట్ ను ఇచ్చిన గీతా బ్యానర్ లో తన అదృష్టాన్ని వెదుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. దర్శకుడు వాసువర్మ ఇచ్చిన కథతో పరుగు, బొమ్మరిల్లు లాంటి సినిమాలు అందించిన భాస్కర్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు. 

అఖిల్ అక్కినేని హీరోగా  అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్ పై  బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శక‌త్వంలో చేపట్టిన సినిమాకు ఈ రోజు శ్రీకారం చుట్టారు.  బ‌న్నీవాసు, వాసు వ‌ర్మ లు నిర్మాత‌లుగా నిర్మాణం చేప‌డుతున్న చిత్రం పూజాకార్యక్రమాలు ఈరోజు  ఫిల్మ్‌న‌గ‌ర్ టెంపుల్ లో జరిగాయి.  ఈ కార్యక్రమానికి  నాగార్జున, అమ‌ల,  చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ, శ్రీ అల్లు అర‌వింద్ భార్య నిర్మ‌, ద‌ర్శకులు ప‌రుశురామ్, శ్రీకాంత్ అడ్డాల, మారుతి హ‌జ‌ర‌య్యారు. 

నాగార్జున గారు  ద‌ర్శక‌త్వం వ‌హించ‌గా  అల్లు అర్జున్ త‌న‌యుడు  అల్లు  ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయ‌గా  అల్లు అర‌వింద్  మ‌న‌మరాలు  బేబి అన్విత క్లాప్ కొట్టారు. ఒక విధంగా ఈ సినిమాకు హేమా హేమీలు పాలు పంచుకుంటున్నారు. స్క్రిప్ట్ డాక్టర్ గా పేరున్న వాసువర్మ, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, నిర్మాతలు అరవింద్, బన్నీ వాస్ ఇలా అందరూ కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. 

అఖిల్ కొత్త సినిమా ప్రారంభ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి