Advertisement

Advertisement


Home > Movies - Movie News

లూసీఫ‌ర్ కు సీక్వెల్ అయితే ఖాయ‌మే!

లూసీఫ‌ర్ కు సీక్వెల్ అయితే ఖాయ‌మే!

సాధార‌ణంగా ఒక సినిమా ప్ర‌మోష‌న్ ద‌శ‌లోనే ఆ సినిమాకు సీక్వెల్ అని అన‌డం ఒక టెక్నిక్. స‌ద‌రు ద‌ర్శ‌కుడితో త‌ను మ‌రో సినిమా చేయడానికి సిద్ధ‌మ‌ని హీరో చెప్ప‌డం, అది త‌న అదృష్ట‌మంటూ ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించుకోవ‌డం.. ఇదంతా రొటీన్ త‌తంగ‌మే. త‌మ బ్యాచ్ మొత్తం మ‌రో సినిమా చేస్తుందంటూ ఇంకా విడుద‌ల‌కు ముందే హ‌డావుడి చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్ర‌మోష‌న్ టెక్నిక్స్ అయితే కొత్త కాదు. 

ఇలాంటి హ‌డావుడే చిరంజీవి తాజా సినిమా గాడ్ ఫాద‌ర్ విష‌యంలో కూడా జ‌రుగుతోంది. ఈ సినిమా కు సీక్వెల్ ఉండ‌వ‌చ్చ‌న్న‌ట్టుగా చిరంజీవి స్పందించారు. ద‌ర్శ‌కుడు ఆ మేర‌కు కొన్ని క్లూస్ వ‌దిలాండంటూ కూడా చిరంజీవి త‌న సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ లో స్పందిస్తున్నారు! మ‌రి తెలుగులో ఈ సినిమా సీక్వెల్ మాటేమో కానీ..మ‌ల‌యాళంలో అయితే దీనికి సీక్వెల్ దాదాపు ఉండ‌వ‌చ్చు.

ఇప్ప‌టికే ఈ ప్ర‌క‌ట‌న చేశారు అక్క‌డి రూప‌క‌ర్త‌లు. ఎల్2 పేరుతో ఆ ప్రాజెక్టును ప్ర‌క‌టించారు. ఈ సినిమా కు కూడా పృథ్విరాజ్ సుకుమార‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. మోహ‌న్ లాల్ హీరోగా లూసీఫర్ 2 రాబోతోంది.లూసీఫర్ మ‌ల‌యాళంలో హిట్ అయిన రేంజ్ ను బ‌ట్టి చూస్తే సీక్వెల్ రావ‌డంలో పెద్ద వింత ఉండ‌దు. ఎలాగూ సీక్వెల్ కు అవ‌కాశం ఉండ‌నే ఉంటుంది. పొలిటిక‌ల్ డ్రామాకు కొన‌సాగింపును ఇవ్వ‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ సీక్వెల్ అయితే ఖాయంగా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ మేర‌కు పృథ్విరాజ్ కూడా ప్ర‌క‌టించాడు. ఆ మ‌ధ్య క‌డువా సినిమా ప్ర‌చారం కోసం హైద‌రాబాద్ కు వ‌చ్చి లూసీఫ‌ర్ కు సీక్వెల్ ప్రాజెక్టు గురించి మాట్లాడాడు. తెలుగులో అవ‌కాశం వ‌స్తే చిరంజీవిని డైరెక్ట్ చేయ‌డం ప‌ట్ల కూడా ఉత్సాహాన్ని చూపించాడు. మ‌రి గాడ్ ఫాద‌ర్ గ‌నుక సూప‌ర్ హిట్ అనిపించుకుంటే.. సీక్వెల్ పార్ట్  ఖాయ‌మే కావొచ్చు. తెలుగు సంగ‌తెలా ఉన్నా.. మ‌ల‌యాళంలో మాత్రం సీక్వెల్ ఖాయ‌మే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?