Advertisement


Home > Movies - Movie News
గురిచూసి కొట్టిన గూఢచారి: ఫస్ట్ వీకెండ్ సూపర్ హిట్

ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల సందడిలేదు. చాపకింద నీరులా సైలెంట్ హిట్ కొట్టిన ఆర్ఎక్స్-100 హవా కూడా తగ్గిపోయింది. బాక్సాఫీస్ లో ఉన్న ఈ గ్యాప్ ను సరిగ్గా క్యాష్ చేసుకుంది గూఢచారి సినిమా. అడవి శేష్ నటించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో అదరగొట్టింది. 

దాదాపు 6కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 4కోట్ల 39లక్షల రూపాయలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే 2కోట్ల 85లక్షల రూపాయల షేర్ వచ్చింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. రిలీజైన ఫస్ట్ డే నుంచి రోజురోజుకు ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. అదే గూఢచారికి ప్లస్ పాయింట్. 

ఈ మూవీతో పాటు విడుదలైన బ్రాండ్  బాబు ఫ్లాప్ అయింది. చిలసౌ ఓ మోస్తరు హిట్ అనిపించుకుంది. ఈ  గురువారం శ్రీనివాసకల్యాణం థియేటర్లలోకి వస్తోంది. సో.. అప్పటివరకు గూఢచారిదే హవా. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం - రూ. 1.26 కోట్లు
సీడెడ్ - రూ. 0.25 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 0.40 కోట్లు
ఈస్ట్ - రూ. 0.20 కోట్లు
వెస్ట్ - రూ. 0.14 కోట్లు
గుంటూరు - రూ. 0.23 కోట్లు
కృష్ణా - రూ. 0.29 కోట్లు
నెల్లూరు - రూ. 0.08 కోట్లు