Advertisement

Advertisement


Home > Movies - Movie News

క్రాక్ లో రవితేజకు నచ్చినవి ఈ రెండే

క్రాక్ లో రవితేజకు నచ్చినవి ఈ రెండే

పోలీస్ పాత్రలు రవితేజకు కొత్తకాదు. ఖాకీ చొక్కాతో విక్రమార్కుడు లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు కొన్ని అట్టర్ ఫ్లాప్స్ కూడా అందుకున్నాడు. ఇలాంటి హీరో మరోసారి ఖాకీ చొక్కా తొడగాలంటే కథలో ఏదో ఒకటి బాగా నచ్చి ఉండాలి. మరి క్రాక్ సినిమాలో రవితేజకు నచ్చిన అంశాలేంటి?

క్రాక్ సినిమాలో రవితేజకు కేవలం రెండంటే రెండు అంశాలు మాత్రమే నచ్చాయని చెబుతున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆ రెండు ఎలిమెంట్స్ నెరేషన్ విన్న వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నామంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.

"కథ చెబుతానని రవితేజను అడిగినప్పుడు, నేను ఎంటర్ టైనర్ చెబుతానని ఆయన అనుకున్నారు. గంటా 45 నిమిషాలు కథ చెప్పాను. సినిమా చూపించినట్టు ప్రతి అంశం విడమర్చి చెప్పాను. 

నేను చెప్పిన బ్యాక్ డ్రాప్, రియలిస్టిక్ ఎప్రోచ్ చూసి స్టన్ అయ్యారు. కథ చాలా జెన్యూన్ గా ఉంది, అదిరిపోయింది అన్నారు. అదే ఆయన ఫస్ట్ ఎక్స్ ప్రెషన్. ఇక సెకెండాఫ్ లో శృతిహాసన్ పోలీసాఫీసర్ అని చెప్పగానే, అదిరిపోయింది అబ్బాయ్ అన్నారు."

క్రాక్ లో రవితేజకు ఈ రెండు ఎలిమెంట్స్ బాగా నచ్చాయని చెబుతున్నాడు గోపీచంద్ మలినేని. ఇక ఈ సినిమా తను తీయడానికి, ఈ కథ ఎంచుకోడానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. 

తన సినిమాల్లో ఎంటర్ టైన్ మెంట్, కామెడీ ఎక్కువగా ఉంటుందని.. తను యాక్షన్ సబ్జెక్ట్ కూడా హ్యాండిల్ చేయగలనని నిరూపించుకోవడం కోసం క్రాక్ తీశానని అంటున్నాడు ఈ దర్శకుడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?