cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

గుండెల్లో నిండిన ప్రేమపై 'ఉప్పెన'

గుండెల్లో నిండిన ప్రేమపై 'ఉప్పెన'

భావుకత నిండిన ప్రేమకథ చిత్రాలు ఎప్పుడూ జనాల గుండెల్ని తడతాయి. చాలా రేర్ గా ఇలాంటి సినిమాలు తీయాలనే ప్రయత్నం జరుగుతుంటుంది. మరో చరిత్ర, ప్రేమ, నువ్వేకావాలి, ఇలా అప్పుడప్పుడు వస్తుంటాయి మంచి ప్రేమ కథ చిత్రాలు.

ఆ లక్షణాలు వున్నాయి అనిపించేలా విడుదయింది 'ఉప్పెన' టీజర్. లేటెస్ట్ మెగా హీరో సాయి తేజ్ నటించిన తొలిచిత్రం ఇది. సుకుమార్ సహాయకుడు సానా బుచ్చిబాబుకు దర్శకుడిగా తొలి చిత్రం. గోదావరి జిల్లా ఉప్పాడ నేపథ్యంలోతయారుచేసుకున్న ప్రేమకథ.

ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. మొత్తం సినిమాను ఎట్ ఎ గ్లాన్స్ అన్నట్లు చెప్పే ప్రయత్నం టీజర్ లోనే చేసారు. టీజర్ మొత్తానికి దేవీ హిట్ సాంగ్..నీ నవ్వు నీలి సముద్రం పాట బిజిఎమ్ నే వాడారు.

స్వచ్ఛమైన ప్రేమకథ, దాని పర్యవసానం అన్న పాయింట్లు కొత్తవి కావు, కానీ కొత్తగా, గుండెలకు హత్తుకునేలా చేయాలనే ప్రయత్నం కొత్తది. టీజర్ బాగుంది. సినిమా ఎలా వుంటుందో చూడాలి.

 


×