cloudfront

Advertisement


Home > Movies - Movie News

తప్పు నాది కాదు: ఛీటింగ్ కేసుపై హన్సిక

తప్పు నాది కాదు: ఛీటింగ్ కేసుపై హన్సిక

ఆపిల్ బ్యూటీ హన్సికపై ఆమె మాజీ మేనేజర్ మునుస్వామి ఛీటింగ్ కేసు పెట్టాడు. 3రోజులుగా హల్ చల్ చేస్తున్న ఈ వార్తపై ఎట్టకేలకు స్పందించింది హన్సిక. మునుస్వామి ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదని, అతనితో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తానని ప్రకటించింది.

చాన్నాళ్లుగా హన్సికకు మేనేజర్ గా పనిచేశాడు మునుస్వామి. ఈ మధ్యే ఆ పోస్ట్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం హన్సిక వ్యవహారాలన్నీ ఆమె తల్లి చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. తనకు ఇవ్వాల్సిన పారితోషికం పూర్తిగా ఇవ్వలేదని ఆరోపిస్తూ నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశాడు మునుస్వామి. దాదాపు కోటి రూపాయల వరకు హన్సిక తనకు బాకీ పడిందని వాదిస్తున్నాడు.

3రోజులుగా ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న హన్సిక దీనిపై స్పందించింది. మునుస్వామికి ఎప్పటికప్పుడు పేమెంట్స్ సరిగ్గా ఇస్తూనే ఉన్నానని, తను డబ్బులు ఇవ్వకపోతే మునుస్వామి ఇన్నేళ్లు తన వద్ద ఎలా పనిచేస్తాడని ప్రశ్నిస్తోంది. తమ మధ్య ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తోందని, మునుస్వామితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటానని చెబుతోంది.

ఇంతకీ విషయం ఏంటంటే.. హన్సిక పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో మునుస్వామికి శాలరీ పెంచుతానని మాటిచ్చిందట. అతడ్ని ఉద్యోగం నుంచి తొలిగించినప్పుడు మాత్రం ఆ పెంపు అంశాన్ని పట్టించుకోలేదట. ఇచ్చిన మాట ప్రకారం, పెంచిన మొత్తాన్ని కూడా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు మునుస్వామి. అంతేకాకుండా తన వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయంటున్నాడు.