cloudfront

Advertisement


Home > Movies - Movie News

హరీష్ శంకర్ జాయింట్ వెంచర్

హరీష్ శంకర్ జాయింట్ వెంచర్

దర్శకుడు హరీష్ శంకర్ సినిమా నిర్మాణంలోకి ప్రవేశిస్తున్నారు. గతంలోనే ఈ మేరకు వార్తలు వినిపించాయి. కొత్త వారితో స్వంతంగా నిర్మాణం చేపడతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఏవీ మెటీరియలైజ్ కాలేదు. ఇంతలోనే 14 రీల్స్ బ్యానర్ మీద సినిమా ప్రకటించారు.

ఇదిలావుంటే మరోపక్క సమాంతరంగా సినిమాలు నిర్మించాలని డిసైడ్ అయ్యారు. అయితే ప్రాజెక్టు రూపకల్పన తాను, నిర్మాణ కార్యక్రమాలు వేరేవాళ్లు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు.

ఆ సంస్థ నిర్మాత మహేష్ కోనేరు, హరీష్ శంకర్ తమ తమ రెండు బ్యానర్లను కలిపి సినిమాలు నిర్మిస్తారు. కథలు, ప్లానింగ్, ప్రాజెక్ట్ సెట్టింగ్ హరీష్ చూసుకుంటారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు రెండు వేరు వేరు సినిమాల్లో బిజీగా వున్నారు. ఈస్ట్ కోస్ట్ ఫ్రొడక్షన్స్ పై కళ్యాణ్ రామ్ హీరోగా 118 సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.

వ్యాపారవేత్తలు పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా వస్తున్నారు