Advertisement


Home > Movies - Movie News
కాస్టింగ్ కౌచ్ పై ప్రభాస్ హీరోయిన్ రియాక్షన్

తనకు లైన్ వేసే మగాడు ఇంకా పుట్టలేదంటోంది బుజ్జిగాడు హీరోయిన్ సంజన. తనతో మాట్లాడ్డానికే చాలామంది భయపడతారని, ఇక కాస్టింగ్ కౌచ్ కు ఎలాంటి ఆస్కారం లేదంటోంది ఈ హీరోయిన్. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడింది.

"నిజానికి ఎవరైనా నాకు లైనేస్తారేమో అని ఎదురు చూస్తుంటాను. నేను చాలా ఓపెన్ గా, స్ట్రయిట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు ఈ విషయం. అందుకే నా దగ్గర సరదాగా మాట్లాడ్డానికి కూడా 2-3 సార్లు ఆలోచించి మాట్లాడతారు. నేను అంత ఫ్రీడమ్ ఇవ్వను." 

మనం ఎంత గట్టిగా ఉన్నామనే విషయంపైనే కాస్టింగ్ కౌచ్ ఆధారపడి ఉంటుందంటోంది సంజన. అమ్మాయిలు లూజ్ గా ఉంటే లూజ్ గానే ప్రవర్తిస్తారని, ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తోంది. కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాలంటే ఇదొక్కటే మార్గం అంటోంది. 

"మా అసోసియేషన్ లో ఉన్న దర్శకులు, నిర్మాతలు అలా ఉండరు. కృష్ణానగర్ లో తిరిగే కొంతమంది స్టుపిడ్ ప్రొడ్యూసర్స్ అలా ఉంటారు. ఇండస్ట్రీ పేరును పాడుచేస్తోంది వాళ్లు. కాస్టింగ్ కౌచ్ అనేది అసలైన ప్రొడ్యూసర్లు, దర్శకుల నుంచి వచ్చినట్టు ఆధారాల్లేవు."

ఈ విషయంలో అమ్మాయిల్ని కూడా తప్పుపడుతోంది సంజన. అందం, డబ్బు ఉన్న కొంతమంది అమ్మాయిలు, హీరోయిన్ అవకాశాల కోసం వచ్చి కాస్టింగ్ కౌచ్ వలలో పడిపోతున్నారని.. నిజంగా అంత అందంగా ఉంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే బెటరని సలహా ఇస్తోంది సంజన.