cloudfront

Advertisement


Home > Movies - Movie News

హీరోల కోసం కొట్టుకు ఛస్తున్నారు!

హీరోల కోసం కొట్టుకు ఛస్తున్నారు!

తమ అభిమాన హీరో చూసే క్రమంలో ప్రమాదవశాత్తూ అభిమానులు ప్రాణాలు కోల్పోవడం తెలుగునాట కూడా జరుగుతుంటుంది. ఆ మధ్య, పవన్‌ అభిమానులకీ ఎన్టీఆర్‌ అభిమానులకీ మధ్య తలెత్తిన వివాదం, ఓ అభిమాని హత్యకు దారితీసింది. పవన్‌ కళ్యాణ్‌ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు అప్పట్లో. ఆ అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన పవన్‌, సినీ పరిశ్రమలో తామంతా కలిసే వుంటామనీ, అభిమానులెవరూ హద్దులు దాటి కొట్టుకోవద్దనీ పిలుపునిచ్చాడనుకోండి.. అది వేరే విషయం.

ఇక, ఇప్పుడు అసలు విషయానికొస్తే తమిళనాడులో రెండో పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. అందులో ఒకటి రజనీకాంత్‌ సినిమా 'పెట్టా' అయితే, ఇంకోటి అజిత్‌ సినిమా 'విశ్వాసం'. ఇద్దరు హీరోలకీ తమిళనాడులో 'స్టార్‌ డమ్‌' వుంది, రజనీకాంత్‌కి ఇంకాస్త ఎక్కువ స్టార్‌డమ్‌ వుందన్న విషయం అందరికీ తెల్సిందే. ఆ స్టార్‌డమ్‌ సంగతేమో గానీ, ఆ మత్తులో మునిగిపోయి అభిమానులు కొట్టుకున్నారు.

ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు విడుదలవడంతో, థియేటర్ల వద్ద ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధానంగా మల్టీప్లెక్స్‌లు, ఒకేచోట రెండు మూడు థియేటర్లు వున్న ప్రాంతాల్లో ఈ ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా కన్పిస్తున్నాయి.

పలువురు అభిమానులకు ఈ గలాటా కారణంగా కత్తిపోట్లు పడటంతో, వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ కత్తి పోట్ల వ్యవహారం వెలుగు చూడ్డంతో, అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు. సోషల్‌ మీడియాలో అభిమానుల రచ్చ ముదిరి పాకాన పడుతుండడం ఓ ఎత్తు అయితే, భౌతిక దాడులకు దిగుతుండడం ఇంకో ఎత్తు.

అభిమానుల మధ్య ఈ తరహా ఉద్రిక్త పరిస్థితులకు ఆయా హీరోలే బాధ్యత వహించాల్సి వుంటుంది. రెండున్నర గంటల సినిమా కోసం, జీవితాన్ని నాశనం చేసుకోవడమంటే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.? అయినాగానీ, అభిమాన పైత్యానికి లాజిక్‌ వుండదు కదా.!  

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది